- దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మడివి రమేష్
పినపాక
ఖమ్మం జిల్లా పినపాక మండలంలో సీపీఎం నాయకుడి పై వలస ఆదివాసీలు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో వలస ఆదివాసీలకు నాయకుడు, సీపీఎం మండల కమిటీ సభ్యుడు మడివి రమేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఛత్తీస్‌గఢ్ నంచి వలసవచ్చిన ఆదివాసీలు మండలంలోని జానంపేట పంచాయతీ పరిధిలో సుందరయ్యనగర్‌లో నివాసం ఏర్పరచుకున్నారు.ఇది పూర్తిగా వలసవచ్చిన ఆదివాసీల కాలనీ.
వీరందరికీ మడివి రమేష్ పెద్దదిక్కువగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి గురువారం నలుగురు వ్యక్తులు రమేష్ దగ్గరకు వచ్చి తాము కూడా ఇక్కడే కూలీ పనులు చూసుకుని జీవిస్తామని చెప్పారు. రమేష్ ఇంట్లోనే బస చేసిన ఆ నలుగురు శుక్రవారం అతడిపై కత్తితో దాడి చేసి గోదావరి దాటి పారిపోయారు. తీవ్ర గాయాలైన రమేష్‌ను తొలుత భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మం తరలించే ఏర్పాటు చేశారు.
సీపీఎం నాయకుడిపై ఆదివాసీల దాడి..
Published Fri, Apr 29 2016 5:54 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement