Chetti Palguna
-
అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ
సాక్షి, అల్లూరి జిల్లా: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో గిరిజన సంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని వర్గాలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. 'శ్రీకృష్ణ కమిషన్ కూడా వెనుక బడిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నినాదం అని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో ఎలా యాత్ర చేపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వికేంద్రీకరణపై విమర్శలు చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు కూడా అమరావతి రాజధాని ఇష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతల్లో కూడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు వినడం మాని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బయటకు రావాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ను విడిచి రావడంతో ఏపీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఐక్యవేదిక అభిప్రాయపడింది. విభజన సమయంలోనే వికేంద్రీకరణ జరిగి ఉంటే అమరావతిలో పెట్టిన డబ్బు వృథా అయ్యేది కాదని స్పష్టం చేసింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలిపింది. గిరిజనుల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, విశాఖ కేంద్రంగా రాజధాని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఒకే చోట అభివృద్ధి ఎప్పటికైనా ప్రమాదకరని, గిరిజనులు ప్రాజెక్టుల కోస భూములు త్యాగం చేశారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. అమరావతి రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదని పేర్కొంది. -
ఘనంగా అరకు ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుక
సాక్షి, అరకులోయ రూరల్: అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కుమారుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ వివాహ వేడుక స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్ పర్సన్ స్వాతి రాణి, ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే హైమావతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అరకులోయ, పాడేరు తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు) -
‘అమ్మఒడి’పై సినిమా.. ప్రధానోపాధ్యాయుడి పాత్రలో ఎమ్మెల్యే
పాడేరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్నాల్లోని అమ్మఒడి పథకం పేరు మీద శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ ఓ చలనచిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే వెండితెర మీదకు రానున్న ఈ చిత్రంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. తహసీల్దార్ ప్రకాష్‌రావు ఎమ్మెల్యేకు క్లాప్ కొట్టారు. షూటింగ్ అనంతరం ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలలో అమ్మఒడి ఒకటని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు పేరుతో ఊహించని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. అమ్మఒడి పథకంపై చలనచిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు. ఈ చిత్రానికి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: Rythu Bharosa: ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా) -
‘ప్రజలు మరిచిపోలేదు.. అదో పెద్ద జోక్’
సాక్షి, అరకు: పవన్‌కల్యాణ్‌లో మరోసారి అపరిచితుడు బయటపడ్డారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విమర్శించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో రాజధాని వద్దనే హక్కు పవన్‌కల్యాణ్‌కు లేదని మండిపడ్డారు.గాజువాక ప్రజలు ఛీ కొట్టడంతో విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ‘‘విశాఖ మరో నందిగ్రామ్ అవుతుందనే పవన్ మాటల్లో అర్థం ఏమిటి?. విశాఖలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్ర పన్నుతున్నారా?’’ అని ప్రశ్నించారు. విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్టులో పట్టిన గతే పవన్‌కు పడుతుందని హెచ్చరించారు. (బాబు, వపన్‌లకు పనిపాట లేదు) ‘‘పవన్‌కల్యాణ్‌కి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. గతంలో పాడేరు నుంచి పోటీ చేస్తానని పవన్ అన్న మాటలు జనం మరిచిపోలేదు. అదో పెద్ద జోక్ గా గిరిజనం చెప్పుకుంటున్నారు. మీకు రాజకీయాల్లో చంద్రబాబు పరువు లేకుండా చేశారు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తే కనీసం ఆస్తులైనా మిగులుతాయని’’ ఎమ్మెల్యే ఫాల్గుణ హితవు పలికారు. (ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం) -
ఆ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళిత సంక్షేమానికి పెట్టని కోటగా పరిస్థితి కొనసాగుతుంటే టీడీపీ నాయకులు భరించలేక పోతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు రాజన్నదొర, చెట్టి ఫాల్గుణలతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. సీఎం జగన్ మాత్రం ఏడాది కాలంలోనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆయనలో అంబేద్కరిజం కనిపిస్తోంది. ఈమధ్య టీడీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే ప్రజల ప్రయోజనాల కోసం ఏమైనా అడుగుతారేమోనని అనుకున్నాను. కానీ స్కాం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రులను విడిచిపెట్టాలని రాష్ట్రపతిని కలిశారని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులు బయట పడినప్పుడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పుడు ఈ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?’ అంటూ ప్రశ్నించారు. టీడీపీ పాలనలోచంద్రబాబు సొంతంగా రాజ్యాంగాన్ని అమలు చేశారే తప్పా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడా అమలు చేయలేదు. చంద్రబాబుకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని, గతంలో అన్ని రంగాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్‌గా న్యాయ కోవిదుడైన దళితుడిని నియమిస్తే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే టీడీపీ నేతలు అమరావతిలో వ్యాపారాల కోసం అక్కడ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. (చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ) అభివృద్ధి భయం పట్టుకుంది: రాజన్నదొర విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు స్వాగతిస్తున్నామని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. ఐదేళ్లూ ఉత్తరాంధ్రను పట్టించుకోని టీడీపీ నాయకులు.. ఇప్పుడు సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో గిరిజనులకు ఎంత ఖర్చు చేశారో, తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఎంత ఖర్చు చేశామన్నదానిపై చర్చకు సిద్ధమని రాజన్నదొర అన్నారు. టీడీపీ నాయకులకు జగన్మోహన్రెడ్డి అభివృద్ధి మంత్రం భయం పట్టుకుందని అన్నారు. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. శవ రాజకీయం కోసం అర్హత లేని వ్యక్తికి ఆరు నెలలు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోని తీసేసారంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో కనీసం గిరిజన సలహా మండలి కూడా నియమించలేదని రాజన్నదొర పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు గిరిజనుల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదరించారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. బీసీ ,ఎస్సీ ఎస్టీ మహిళలకు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గిరిజనులకు భూమి పట్టాలిస్తే ఇప్పడు సీఎం జగన్.. నాలుగింతలు ఎక్కువగా భూమి పట్టాలిచ్చారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాల పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికే ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతలకు భయం పట్టుకుంది
-
అరకు అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: చెట్టి ఫాల్గుణ
సాక్షి, విశాఖ : వందకోట్లతో అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల రోడ్లు అనుసంధాన పనులు త్వరలో ప్రారంభిస్తామని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 161 రోజుల ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే ఫాల్గుణ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడేరులో మెడికల్ కళాశాలతోపాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న వివిధ పనులపై ప్రస్తావించారు. అరకు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అరకు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేలకు పైగా రైతులకు రైతు భరోసా అందిందని, వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా 756 మందికి పైగా పదివేలు ప్రోత్సాహంగా ఇచ్చినట్లు వెల్లడించారు. సంతల్లోని రైతులకు షెడ్ల నిర్మాణానికి పంతొమ్మిది కోట్లు కేటాయించినట్లు.. 25 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణానికి ఎనిమిది కోట్లు కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు సదుపాయం కల్పించనున్నామని చెట్టి ఫాల్గుణ వివరించారు. -
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ
-
దత్తత గ్రామాన్ని పట్టించుకోని చంద్రబాబు
సాక్షి, అరకు: పెడలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం అరకులో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి దిశగా అడుగులు పడలేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవో-97ను రద్దు చేశారని చెప్పారు. ప్రతీ నియోజక వర్గానికి కోటి రూపాయలు మంజూరు చేసి సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారన్నారు. గిరిజన అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, కలెక్టర్ వినయ్ చంద్, జీసిసి ఎండీ బాబూరావు నాయుడు పాల్గొన్నారు. -
టీడీపీకి ఝలక్
సాక్షి, హుకుంపేట (విశాఖపట్నం): ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. హుకుంపేట మండలాధ్యక్షురాలు, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు తమర్భ సత్యమాధవి శనివారం తన ఎంపీపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఎంపీపీ పదవికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు ఆమె అందజేశారు. అలాగే టీడీపీ జిల్లా నాయకులకు పార్టీకి సంబంధించిన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలకు ఒరిగిందేమి శూన్యమన్నారు. గిరిజనుల ఆదరణ కోల్పోయిన టీడీపీకి భవిష్యత్ లేదని పేర్కొన్నారు. గిరిజనులంతా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉన్నారని, ఈ విషయం ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుజువైందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించి తన ఎంపీపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ గూటికి సత్యమాధవి ఎంపీపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తమర్భ సత్యమాధవి తన అనుచరులతో కలిసి అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే గిరిజనులకు మంచి జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమలు చేస్తున్నారన్నారు. బాక్సైట్ తవ్వకాల జీవోలను రద్దు చేసి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్సీపీలో చేరుతున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సత్యమాధవికి ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అలాగే టీడీపీకి చెందిన గత్తుం పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ గత్తుం భీమ్నాయుడు, మాజీ వార్డుమెంబర్లు శోభ రమేష్, గత్తుం లక్ష్మీనాయుడులు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. పదవులకు రాజీనామా చేశాకే చేర్చుకుంటాం: ఎమ్మెల్యే పాల్గుణ సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ, ఇతర పార్టీల నేతలు వైఎస్సార్సీపీలో చేరాలంటే ముందుగా వారు రాజకీయ, పార్టీ పదవులకు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. హుకుంపేట ఎంపీపీగా పనిచేసిన తమర్భ సత్యమాధవి కూడా తన పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు గండేరు చినసత్యం, మండల పార్టీ అధ్యక్షుడు గెమ్మెలి కొండబాబు, మాజీ వైస్ ఎంపీపీ బత్తిరి రవిప్రసాద్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్, ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రేగం మత్స్యలింగం, సివేరి కొండలరావు, ఎంపీటీసీ మాజీ సభ్యులు కె.బి.సావిత్రి, కంబిడి చిన్నబ్బి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న సత్యమాధవి వైఎస్సార్సీపీలో చేరిన ఎంపీపీ సత్యమాధవి, మాజీ సర్పంచ్ భీమ్నాయుడులకు కండువాలు కప్పుతున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ -
బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయడం హర్షనీయం
సాక్షి, అరకు : బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, వారు జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరకు లోయలో సంబరాలు నిర్వహించిన అనంతరం స్థానిక గిరిజనులతో కలిసి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అశోక్, సుబ్రమణ్యం,భాస్కర్, చిన్నారావు పాల్గొన్నారు.