
కిడారి సర్వేశ్వరరావు
సాక్షి, విశాఖపట్నం : ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఆదివారం ఉదయం దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే హత్యకు క్వారీ వివాదమే కారణమని తెలుస్తోంది. కిడారికి చెందిన గూడ క్వారీని మూసివేయాలని మావోయిస్టులు పలుమార్లు ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి కూడా వ్యక్తమైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే మావోయిస్టులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో మావోయిస్టులు తన మైనింగ్ దగ్గరకు వెళ్తున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపై కాల్పులు జరిపారు. అయితే ఎమ్మెల్యే కిడారి పర్యటనపై తమకు సమాచారం లేదని స్థానికు పోలీసులు తెలిపారు.