సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. డుంబ్రి గూడ పోలీసుస్టేషన్‌కు నిప్పంటించారు. పోలీసుల నిర్లక్ష్యమే సోమ హత్యకు కారణమని నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఈ దాడిలో పోలీస్టేషన్ల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసయ్యాయి. ఓ కానిస్టేబుల్‌పై సోము అనుచరులు భౌతికంగా దాడిచేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment