అరకు లోయలో బొలేరో బోల్తా | passengers injured in bolero slipped incident | Sakshi
Sakshi News home page

అరకు లోయలో బొలేరో బోల్తా

Nov 9 2017 12:45 PM | Updated on Apr 7 2019 3:24 PM

సాక్షి, విజయనగరం : అరకు పర్యటనకు వెళ్లి వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతగిరి నాలుగో టన్నల్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామానికి చెందిన వారు బొలేరో వాహనంలో అరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వాహనంలో ఉన్న 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులు శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement