ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అరకులోయ/విశాఖపట్నం: అరకు అందాలకు దగ్గరగా తీసుకెళ్లి పర్యాటకులను అలరించే కిరండోల్-కొత్తవలస(కేకే) రైలుమార్గంలో పెను ప్రమాదం తప్పింది. శిమిలిగూడ, అరకు రైల్వే స్టేషన్ల మధ్య 95/24 నెంబర్ వద్ద పట్టాలు విరిగిపోయాయి. రైల్వే సిబ్బంధి అప్రమత్తంగా వ్యవహరిచడంతో ఎటువంటి ఘటన చేసుకోలేదు. దాదాపు 20 మీటర్ల వరకు పట్టాలు మార్చాల్సి ఉంటుందనీ, ఈ పని పూర్తవడానికి ఒక రోజు పడుతుందని జూనియర్ ఇంజనీర్ అప్పారావు తెలిపారు.
సిబ్బంది అప్రమత్తంగా వ్యహరించడంతో రైల్వే శాఖ భారీ నష్టం నుంచి బయటపడిందనీ అన్నారు. ట్రాక్ మెన్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. కాగా, పర్యాటకులు ఈ మార్గం గుండానే అరకులోయ అందాల్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. 58 సొరంగాలు, 84 వంతెనల గుండా దాదాపు 3 గంటల పాటు సాగే కేకే రైల్వే లైన్ రైలు ప్రయాణమంటే మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి సొంతమవ్వాల్సిందే..!
గతంలో రైల్వేకు భారీ నష్టం..
విశాఖలోని ఉక్కు పరిశ్రమకు ఈ మార్గం గుండానే ఇనుప ఖనిజం సరఫరా అవుతుంది. గతేడాది వర్షాల కారణంగా కేకే రైలు మార్గం దెబ్బతినగా.. లైను పునరుద్ధరణకు రెండు నెలలు పట్టింది. ముడి ఖనిజం రవాణా నిలిచి పోవడంతో రైల్వేకు దాదాపు 300 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment