railway line broken
-
రైల్వే ట్రాక్ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు..!
జైపూర్: ఉదయ్‌పుర్- అహ్మదాబాద్ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీంతో ట్రాక్ దెబ్బతిన్నట్లు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పుర్ జిల్లా కెవ్డాలో ఉన్న ఓడ రైల్వే బ్రిడ్జ్‌ను జిల్లా కలెక్టర్ తారాచంద్ మీనా ఆదివారం తనిఖీ చేశారు. పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ పేలుడు సంఘటన కలకలం సృష్టించిన క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ట్వీట్ చేశారు. ఓడ రైల్వే వంతెనపై పేలుడుతో రైల్వే ట్రాక్ పాడవటం ఆందోళనకర విషయమని, సీనియర్ అధికారులు స్పాట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. వంతెన పునఃనిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. ఈ రైల్వే లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్ 31నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా? -
అరకులో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, అరకులోయ/విశాఖపట్నం: అరకు అందాలకు దగ్గరగా తీసుకెళ్లి పర్యాటకులను అలరించే కిరండోల్-కొత్తవలస(కేకే) రైలుమార్గంలో పెను ప్రమాదం తప్పింది. శిమిలిగూడ, అరకు రైల్వే స్టేషన్ల మధ్య 95/24 నెంబర్ వద్ద పట్టాలు విరిగిపోయాయి. రైల్వే సిబ్బంధి అప్రమత్తంగా వ్యవహరిచడంతో ఎటువంటి ఘటన చేసుకోలేదు. దాదాపు 20 మీటర్ల వరకు పట్టాలు మార్చాల్సి ఉంటుందనీ, ఈ పని పూర్తవడానికి ఒక రోజు పడుతుందని జూనియర్ ఇంజనీర్ అప్పారావు తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యహరించడంతో రైల్వే శాఖ భారీ నష్టం నుంచి బయటపడిందనీ అన్నారు. ట్రాక్ మెన్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. కాగా, పర్యాటకులు ఈ మార్గం గుండానే అరకులోయ అందాల్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. 58 సొరంగాలు, 84 వంతెనల గుండా దాదాపు 3 గంటల పాటు సాగే కేకే రైల్వే లైన్ రైలు ప్రయాణమంటే మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి సొంతమవ్వాల్సిందే..! గతంలో రైల్వేకు భారీ నష్టం.. విశాఖలోని ఉక్కు పరిశ్రమకు ఈ మార్గం గుండానే ఇనుప ఖనిజం సరఫరా అవుతుంది. గతేడాది వర్షాల కారణంగా కేకే రైలు మార్గం దెబ్బతినగా.. లైను పునరుద్ధరణకు రెండు నెలలు పట్టింది. ముడి ఖనిజం రవాణా నిలిచి పోవడంతో రైల్వేకు దాదాపు 300 కోట్ల మేర నష్టం వాటిల్లింది. -
శ్రీకాకుళం జిల్లాలో తప్పిన పెను ముప్పు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గురువారం పెను ప్రమాదం తప్పింది. పొందూరు సమీపంలో రైలు పట్టాలు విరగ్గా అది గుర్తించిన రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అటుగా ప్రయాణించాల్సిన రైళ్లను ఆముదాలవలస, చీపురుపల్లి స్టేషన్లలో ఆపివేశారు. ప్రస్తుతం పట్టాలను పునరుద్ధరిస్తున్నారు.