1 నుంచి సువిధ ప్రత్యేక రైళ్లు | Special Train From Santragachi To Coimbatore | Sakshi
Sakshi News home page

1 నుంచి సువిధ ప్రత్యేక రైళ్లు

Published Sat, Dec 21 2019 9:54 AM | Last Updated on Sat, Dec 21 2019 9:54 AM

Special Train From Santragachi To Coimbatore - Sakshi

అల్లిపురం(విశాఖ దక్షిణ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంత్రాగచ్చి–కోయంబత్తూర్‌ల మధ్య సువిధ ప్రత్యేక రైలును నడపనున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జి.సునీల్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు జనవరి 1 నుంచి 26 వరకు ప్రతి బుధవారం సంత్రాగచ్చిలో, జనవరి 3 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం కోయంబత్తూరులో బయలుదేరుతుందని తెలిపారు. హాతియా – బెంగుళూరు కాంటినెంటల్‌ వయా రాయగడ సువిధ వీక్లీ ప్రత్యేక రైలు జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శుక్రవారం హాతియాలో, జనవరి 5 నుంచి మార్చి 1 వరకు బెంగుళూరు కాంటినెంటల్‌లో బయలుదేరుతుందని పేర్కొన్నారు.

సంత్రాగచ్చి – కోయంబత్తూర్‌ల మధ్య..
సంత్రాగచ్చి–కోయంబత్తూరు(80823) సువిధ ప్రత్యేక రైలు సంత్రాగచ్చిలో ప్రతి బుధవారం రాత్రి 9.50 గంటలకు బయలుదేరుతుంది. గురువారం సాయంత్రం 4.03 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి 4.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది.   కోయంబత్తూరు – సంత్రాగచ్చి(80824) సువిధ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం రాత్రి 9.45 గంటలకు కోయంబత్తూరులో బయలుదేరి శనివారం సాయంత్రం 6.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 6.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది.

హాతియా – బెంగుళూరుల మధ్య.. 
హాతియా – బెంగుళూరు(80635) కాంటినెంటల్‌ సువిధ వీక్లీ రైలు ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటలకు హాతియాలో బయలుదేరి శనివారం సాయంత్రం 6.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 6.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగుళూరు కాంటినెంట్‌ల్‌ చేరుకుంటుంది. బెంగుళూరు కాంటినెంటల్‌ – హాతియా(80636) వీక్లీ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 11 గంటలకు బెంగుళూరు కాంటినెంటల్‌లో బయలుదేరి సోమవారం సాయంత్రం 6.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి 6.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హాతియా చేరుకుంటుంది.

జనవరి 26 వరకు అరకు ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు..
అరకు పర్యాటకుల తాకిడి మేరకు విశాఖపట్నం – అరకు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను జనవరి 26 వరకు పొడిగిస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. గత అక్టోబర్‌ నుంచి నడుస్తున్న ఈ ప్రత్యేక రైలుకు పర్యాటకుల నుంచి ఆదరణ బాగున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు, జనవరి 1, 4, 5, 11, 12, 14, 15, 16, 18, 19, 23, 24, 25, 26 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. విశాఖపట్నం – అరకు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌(08517) ప్రతి రోజు ఉదయం 8.10 గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. అరకు – విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌(08518) అరకులో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్‌.కోట, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలు సేవలను పర్యాటకులు, ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement