మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..! PM Modis Love For Araku Valley Coffee This Tase Is Unique | Sakshi
Sakshi News home page

మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!

Published Mon, Jul 1 2024 11:17 AM | Last Updated on Mon, Jul 1 2024 3:13 PM

PM Modis Love For Araku Valley Coffee This Tase Is Unique

కాఫీ ఘుమఘుమలకు వహ్‌..! అని కితాబిస్తు ఒక్క సిప్‌ చేసేందుకు తహతహలాడుతుంటాం. అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది. ఆయన ప్రత్యేకంగా ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ గురించి తరుచుగా చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయలో ప్రసిద్ధి గాంచిని కాఫీ రుచికి మోదీ సైతం పిదా అయ్యారు. 

మన్‌కీ బాత్‌ 111వ ఎపిసోడ్‌లో ఆ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. గతేడాది సెప్టెంబర్‌ 2023లో భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో కూడా అరకు కాఫీ గురించి హైలెట్‌  చేస్తూ మాట్లాడారు. అంతేగాదు మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌‎గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్‎లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించడం విశేషం. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు. అసలేంటి అరకు కాఫీ ప్రత్యేకతలు అంటే..

అరకు కాఫీ అంటే..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కాఫీ సాగు దాదాపు వంద ఏళ్ల నాటిది. అయితే అది 1947 తర్వాత నెమ్మదిగా క్షీణించింది. మళ్లీ 2000లలో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా  లాభాప్రేక్షలేని  నంది ఫౌండేషన్ సంస్థ ముందుకు కొచ్చి స్థానిక రైతులను ప్రోత్సహించింది. అందుకు అవసరమైన వనరులను కూడా అందించింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడింది. అలాగే  అనేక మంది స్థానికులకు ఉపాధిని కూడా అందించింది. 

ఒకరకంగా ఈ ప్రాంతం  ప్రత్యేక వాతావరణం ద్వారా పండించిన ప్రసిద్ధ కాఫీ గింజలకు పేరుగాంచేందుకు దారితీసింది. అరకులోయలో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో  అధికంగా ఐరన్ ఉండటం తదితర కారణాల వల్ల కాఫీ మొక్కలు నెమ్మదిగా పండటం మొదలయ్యింది. ఆ వాతావరణమే కాఫీ గింజలకు ప్రత్యేకమైన అరోమా  రుచిని తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వతా ఆ అరుకు వ్యాలీ కాఫీకి విశేష ప్రజాధరణ లభించి, అందరి మన్నలను అందుకుంది. అలా 2019లో, అరకు కాఫీకి భౌగోళిక సూచిక (GI) హోదా లభించింది. ప్రస్తుతం అరకు కాఫీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఆధరణ ఉంది. దీనికి సంబంధించి ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌తో వచ్చిన బ్రూ కాఫీ మరితం ఫేమస్‌.

(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement