![Attender Treatment to Patients in Dumbriguda Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/9/attender.jpg.webp?itok=BR9c0ajb)
ఆయుర్వేద ఆస్పత్రిలో ఉన్న అంటెండర్
విశాఖపట్నం, డుంబ్రిగుడ (అరకులోయ) : మండల కేంద్రంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలలో వైద్యాధికారి లేకపోవడంతో వైద్యశాలలో అటెండరే వైద్యాధికారిగా అవతారమెత్తుతున్నారు. రెండేళ్ల నుంచి వైద్యాధికారి లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాంపౌండర్ కూడా బదిలీపై వెళ్లిపోవడంతో ఇప్పటి వరకు ఆస్పత్రి అటెండర్‌తోనే నడుస్తుంది. కీళ్ల నొప్పులు, వివిధ వ్యాధులపై మందులు ఇచ్చేందుకు ఎవరూ లేక మందులు సక్రమంగా అందడం లేదని స్థానికులు అంటున్నారు. ఇక్కడి అధికారి బదిలీపై వెళ్లిపోగా, అంటెండర్‌కు మందులపై అవగాహన లేకపోవడంతో రోగులు ఆస్పత్రికి వచ్చి మందులు లేకుండా తిరుగుముఖం పడుతున్నారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యా«ధికారిని నియమించాలని గిరిజనులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment