
విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది.
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. గుడివాడకు చెందిన సుజిత్, సుప్రియలు అరుకులోని వశిష్ట లాడ్జిలో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు. తాము చనిపోతున్నామంటూ వారు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.
దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు అరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సకాలంలో స్పందించి ప్రేమజంటను రక్షించారు. లాడ్జీ గదిలో బ్లేడు, గ్లాసులు, మాత్రలను పోలీసులు గుర్తించారు. ఇరువురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.