
మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కారు డ్రైవర్ కే చిట్టిబాబు
సాక్షి, విశాఖపట్నం : తమని తుపాకులతో రౌండప్ చేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దూరంగా తీసుకెళ్లి మావోయిస్టుల కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కారు డ్రైవర్ కే చిట్టిబాబు మీడియాకు తెలిపారు. తమ వాహనాలను అడ్డగించిన మావోయిస్టులు.. గన్‌మెన్‌ల ఆయుధాలు తీసుకొని తమని దూరంగా తీసుకెళ్లారన్నారు. అనంతరం కారుల్లో నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దింపి చేతులను వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ మరికొంత మంది మావోయిస్టులు దూరంగా తీసుకెళ్లారని తెలిపారు.
పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చిపారేస్తామని మా దగ్గర కాపలా ఉన్నవారు బెదిరించినట్లు చిట్టిబాబు పేర్కొన్నారు. అనంతరం వారిపై జరిపిన కాల్పులు శబ్దం వినబడ్డాక మమ్మల్ని వదిలేసారని, వారెన్ని అక్రమాలు చేశారో తెలుసా అని తమను ప్రశ్నించారని చిట్టిబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment