ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : అరకు సంతలో శనివారం ఓ విస్తుగొలిపే వార్త వెలుగుచూసింది. నాటు తుపాకులు, బాంబుల తయారీ సామాను అమ్ముతున్న ఇద్డరు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు నాటు తుపాకులు, రెండు కేజీల సీసపు గుళ్లు, తుపాకీ తయారీ సామాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన బూరి సూరీడమ్మ ( 48) దాసరి దేవుడమ్మ ( 50)గా గుర్తించారు.
ఈ ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా అరకు సంతలో నాటు తుపాకీలు, తుపాకీ తయారీ సామాను గుట్టు చప్పుడు కాకుండా అమ్మకం సాగిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. గతంలో అనంతగిరి వద్ద ఆర్టీసీ బస్సులో బాంబు పేలుడు ఈ మహిళల పనేనని పోలీసుల అనుమానిస్తున్నారు. వారి భర్తలు తుపాకులు తయారు చేస్తుండగా సూరీడమ్మ, దేవుడమ్మ తెచ్చి అరకులో అమ్ముతున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment