crude bomb
-
అరకు సంతలో తుపాకుల బేరం..!
సాక్షి, విశాఖపట్నం : అరకు సంతలో శనివారం ఓ విస్తుగొలిపే వార్త వెలుగుచూసింది. నాటు తుపాకులు, బాంబుల తయారీ సామాను అమ్ముతున్న ఇద్డరు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు నాటు తుపాకులు, రెండు కేజీల సీసపు గుళ్లు, తుపాకీ తయారీ సామాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన బూరి సూరీడమ్మ ( 48) దాసరి దేవుడమ్మ ( 50)గా గుర్తించారు. ఈ ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా అరకు సంతలో నాటు తుపాకీలు, తుపాకీ తయారీ సామాను గుట్టు చప్పుడు కాకుండా అమ్మకం సాగిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. గతంలో అనంతగిరి వద్ద ఆర్టీసీ బస్సులో బాంబు పేలుడు ఈ మహిళల పనేనని పోలీసుల అనుమానిస్తున్నారు. వారి భర్తలు తుపాకులు తయారు చేస్తుండగా సూరీడమ్మ, దేవుడమ్మ తెచ్చి అరకులో అమ్ముతున్నట్టు తెలిసింది. -
చిత్తూరులో దారుణం.. నాటుబాంబు తయారు చేస్తుండగా!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలంలో చర్లోపల్లిలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో నాటుబాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో సుధాకర్ అనే వ్యక్తి శరీరం తునాతునకలు అయింది. ప్రమాదంలో సుధాకర్ రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతోపాటు అతని శరీరం సుమారు వంద అడుగుల దూరంలో పడింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
మహానగరి ఎక్స్ ప్రెస్ లో బాంబు
-
మహానగరి ఎక్స్ ప్రెస్ లో బాంబు
మాణిక్ పూర్: వారణాసి-ముంబై మహానగరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెనుముప్పు తప్పింది. స్లీపర్ క్లాస్ లో అమర్చిన నాటు బాంబును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దాన్ని నిర్వీర్యం చేశారు. రైలు గురువారం ఉత్తరప్రదేశ్ లోని మాణిక్ పూర్ కు చేరుకోగానే ఎస్ 3 కోచ్ లోని మరుగుదొడ్డి బయట బాంబును గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ దాన్ని బయటకు తీసింది. బాంబు విషయం తెలియగానే ప్రయాణికులు భయాందోళన చెందారు. ఉగ్రవాదులు ఎవరైనా బాంబు పెట్టారా అనే కోణంలో ముందుగా దర్యాప్తు చేపట్టారు. అయితే భయాందోళన రేపేందుకే బాంబు పెట్టినట్టు తర్వాత గుర్తించారు. -
హెరిటేజ్ స్టోర్‌పై బాంబుదాడి!
శేషాచలం ఎన్కౌంటర్ మంటలు ఇంకా తమిళనాడులో చల్లారలేదు. తాజాగా చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు భగ్గుమంటోంది. -
పాతబస్తీలో తీవ్ర ఘర్షణలు
-
హడలెత్తించిన పేలుడు
ఉలిక్కిపడిన పాతబస్తీ భారీ శబ్దంతో విస్ఫోటం.. మంటలు బెంబేలెత్తిన స్థానికులు నాటుబాంబుగా భావిస్తున్న పోలీసులు యాకుత్‌పురా, న్యూస్‌లైన్: పాతబస్తీలో పేలుడు ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి భవానీనగర్ ఠాణా పరిధిలోని సాలెం చౌక్ 1వ నంబర్ గల్లీలో ఓ ఇంటి ముందు విద్యుత్ స్తంభం వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. ఒక్క క్షణం బెంబేలెత్తిన స్థానికులు.. ఆపై తేరుకుని ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. గల్లీలోని ఓ గోడ పక్కన భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్టు గుర్తించారు. పేలుడు అనంతరం మంటలు చెలరేగడంతో పక్కనే ఉండే ఇంటి గోడలతో పాటు ఓ ఇంటి పరదా, వంటసామగ్రి కాలిపోయాయి. అక్కడికి సమీపంలో ఇంటి ముందు తోపుడు బండిపై నిద్రిస్తున్న మహ్మద్ సల్మాన్ చేతికి స్వల్ప గాయమైంది. పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు ఘటన స్థలానికి చేరుకుని పేలుడు శకలాలను సేకరించాయి. పక్కనే ఉన్న రైల్వేట్రాక్ పరిసర ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గన్‌ఫౌడర్, మేకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి పేలింది నాటుబాంబు అయి ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. గన్‌పౌడర్, మేకుల్ని పరీక్షల నిమిత్తం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సాలెం చౌక్ ప్రాంతంలో నేరారోపణలు ఎదుర్కొంటూ గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నగర అదనపు కమిషనర్(శాంతిభద్రతలు) అంజనీ కుమార్, అదనపు కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్) సందీప్ శాండిల్యా, దక్షిణ మండల డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీసీఐడీ ఎస్పీ రామ్మోహన్ రావు, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డి, దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు ఘటన స్థలాన్ని సందర్శించారు. అకస్మాత్తుగా పేలుడు.. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. ఎటు నుంచి వచ్చిందో, ఎవరూ వేశారో తెలియదు కానీ విద్యుత్ స్తంభం వద్ద పేలుడు పదార్థం పడి మంటలు చెలరేగడంతో మా ఇంట్లోని కర్టెన్ కాలిపోయింది. - అబ్దుల్, ప్రత్యక సాక్షి భయమేసింది.. అర్ధరాత్రి ఇంటి బయట కూర్చుండగా, పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించడంతో భయంతో పారిపోయాను. మొదట ఎవరైనా యువకులు టపాసులు పేల్చారేమోనని భావించాను. కానీ, అక్కడ ఎవరూ లేరు. - షేక్ నబీ, స్థానికుడు