సాక్షి, చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలంలో చర్లోపల్లిలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో నాటుబాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో సుధాకర్ అనే వ్యక్తి శరీరం తునాతునకలు అయింది. ప్రమాదంలో సుధాకర్ రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతోపాటు అతని శరీరం సుమారు వంద అడుగుల దూరంలో పడింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment