మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అంత్యక్రియలు ముగిశాయి. మంత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పాడేరులో భారీ వర్షం పడుతున్నా లేక్కచేయకుండా అభిమానులు, కార్యకర్తలు కిడారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబాలకు ప్రభుత్వ పరంగా, పార్టీపరంగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కిడారి, సోమ కుటుంబాలను మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పరామర్శించారు.