తరగతులు నిర్వహించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల
అరకులోయ: గతేడాది కేంద్ర ప్రభుత్వం అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 10 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో భవనాల నిర్మాణానికి రూ.12కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇటీవల రెవెన్యూ అధికారులు పానిరంగిణి సమీపంలో స్థలాన్ని సేకరించారు. భవనాల నిర్మాణ పనుల ప్రారంభానికి కాంట్రాక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది నుంచి తరగతులు
ఈ ఏడాది నుంచి మహిళా డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రవేశాలు చేపడుతున్నారు. తాత్కాలికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతుల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థినులకు కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే వసతి,భోజన సౌకర్యాలు కల్పించేందుకు ప్రిన్సిపాల్ కె.పద్మలత నిర్ణయించారు. ఈమేరకు కాలేజీ హాస్టల్ వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు.
అడ్మిషన్లు ప్రారంభం
కొద్ది రోజుల్లో ప్రారంభించనున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు. బీఏ, బీకాం, బీఎస్సీలో సీబీజడ్, ఎంపీసీ గ్రూప్‌లకు సంబంధించి 220 సీట్లను కేటాయించారు. ఇప్పటికే సీబీజడ్‌లో 60సీట్లకు అడ్మిషన్లు పూర్తయ్యాయి. మిగిలిన గ్రూపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment