అరకులో బెలూన్‌ ఫెస్టివల్‌  | Balloon Festival in Araku | Sakshi
Sakshi News home page

అరకులో బెలూన్‌ ఫెస్టివల్‌ 

Published Mon, Oct 23 2017 3:31 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

Balloon Festival in Araku - Sakshi

బెలూన్‌ ఫెస్టివల్‌లో హాట్‌ బెలూన్లు (ఫైల్‌)

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ ‘హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌’కు వేదిక కానుంది. నవంబర్‌ 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఈ హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ జరగనుంది. దీనిలో పాల్గొనడానికి 10 నుంచి 12 విదేశీ సంస్థలు రానున్నాయి. రెండేళ్ల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో, గతేడాది కర్ణాటకలోని హంపి, మైసూర్, బీదర్‌లలో ఆయా రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు ఈ ఫెస్ట్‌ను నిర్వహించాయి.

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సఫారీలో అనుభవం ఉన్న ఢిల్లీకి చెందిన స్కై వాల్జ్‌ సంస్థ– ఈ ఫాక్టర్‌ అడ్వెంచర్‌ టూరిజం ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలసి ఏపీటీడీసీ అరకు హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement