Air Balloon
-
ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం
బుధవారం ఉదయం 6 గంటలు.. అది హైదరాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ ప్రాంతం.. ఆకాశం నుంచి ఏదో భారీ వస్తువు.. మెల్లగా ఖాళీ ప్రదేశంలో దిగింది. చూస్తుంటే ఏదో వ్యోమనౌకలా ఉంది. ఆదిత్య 369 సినిమాలోని ‘టైమ్ మెషీన్’లా ఉందని కొందరు.. ఏదో గ్రహాంతర నౌక కావొచ్చని కొందరు.. ఒక్కసారిగా కలకలం రేగింది. అదేమిటో చూద్దామని పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. మరి అక్కడ ల్యాండ్ అయింది ఏమిటో తెలుసా..? అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చే స్పేస్ క్యాప్సూల్. అది ఇక్కడెందుకు దిగింది? మనకు ఏమిటి సంబంధం? ఆ వివరాలు మీకోసం.. సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/మర్పల్లి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న స్పేస్ టూరిజం అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు చెందిన హాలో స్పేస్ సంస్థ ప్రయోగాలు చేస్తోంది. తక్కువ ఖర్చుతో, సులువుగా కొన్ని గంటల పాటు అంతరిక్షంలో తిరిగి వచ్చేందుకు వీలుగా హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్‌ను రూపొందించింది. సుమారు ఎనిమిది మనుషులు, కొంత సామగ్రి దీనిద్వారా ఆకాశంలో సుమారు 40 కిలోమీటర్ల ఎత్తుకు పంపవచ్చు. అక్కడే ఐదారు గంటల పాటు మెల్లగా ప్రయాణిస్తూ.. భూమి అంచులను, దిగువన మేఘాలను, వందలు–వేల కిలోమీటర్ల కొద్దీ దూరాలను వీక్షించవచ్చు. టీఐఎఫ్ఆర్ కేంద్రం నుంచి.. హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) సహకారంతో హాలో స్పేస్ సంస్థ తమ ప్రయోగాన్ని చేసింది. మంగళవారం సాయంత్రం టీఐఎఫ్ఆర్లోని నేషనల్ బెలూన్ ఫెసిలిటీ నుంచి హాలో స్పేస్ హాట్ ఎయిర్‌బెలూన్ క్యాప్సూల్‌ను ప్రయోగించారు. అది అంతరిక్షంలో చాలా ఎత్తుకు చేరి, చక్కర్లు కొట్టిన తర్వాత.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగిద్ద గ్రామ శివార్లలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ల్యాండ్ అయింది. అలా పెద్ద పరికరం ఆకాశం నుంచి వస్తుండటంతో మొగిలిగిద్దతోపాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు కూడా. శాస్త్రవేత్తలు వచ్చి రికవరీ చేసుకుని.. హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్‌ను ప్రయోగించిన హాలోస్పేస్, టీఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తలు దానిని నిరంతరం పరిశీలిస్తూ వచ్చా రు. భూమి నుంచి ఎంత ఎత్తుకు వెళ్లింది, ఎలా సంచరించినదీ ప్రత్యేక పరికరాలతో ట్రాక్ చేశారు. లక్ష్యం మేరకు ప్రయాణం పూర్తయ్యాక నిర్జన ప్రదేశంలో ల్యాండ్ చేశా రు. సాధారణంగా ఈ క్యాప్సూల్‌లో మనుషు లు వెళ్లవచ్చు. అయితే ఇది ప్రయోగాత్మక పరిశీలన కావడంతో వెయ్యి కిలోల బరువున్న వస్తువులను పెట్టి ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం కావడంతో క్యాప్సూల్ 10 కిలోమీటర్లకుపైగా ఎత్తులో 40 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ల్యాండ్ అయిందని వివరించారు. స్పేస్ క్యాప్సూల్‌లోని పరికరాల డేటాను విశ్లేశించాల్సి ఉందని.. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించాయా? అంత ఎత్తులో క్యాప్సూల్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది, మనుషులను పంపేందుకు ఏమేం మార్పులు అవసరం అనేది తేల్చుతామని వెల్లడించారు. తొలి ప్రయోగం మన వద్దే.. హాలో స్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు కార్లోస్ మీరా. స్పేస్ క్యాప్సూల్ రూపకల్పన, ప్రయోగాలకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కాస్ట్రిల్లో ఆధ్వర్యంలోని 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్ష పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసే దిశగా ప్రయోగాలు చేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన స్పేస్ క్యాప్సూల్‌ను తొలిసారిగా హైదరాబాద్‌లోనే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తించే డేటా ఆధారంగా మరింతగా అభివృద్ధి/ మార్పులు చేస్తారు. తర్వాత స్పెయిన్‌లో మరో ప్రయోగం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతేఅంతరిక్షంలోకి మనుషులను పంపుతామని వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.కోటిపైనే.. హాలో స్పేస్ క్యాప్సూల్ 800 కిలోల బరువుతో 5 మీటర్ల వ్యాసం, 3.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ సాయంతో అంతరిక్షంలోకి ఎగుస్తుంది. దీనికితోడుగా ప్యారాచూట్ సాయంతో ల్యాండ్ అవుతుంది. స్పేస్ క్యాప్సూల్‌కు చుట్టూ పెద్ద పెద్ద గాజు అద్దాలను బిగించారు. ఇందులో ప్రయాణించేవారు చుట్టూరా అంతరిక్షాన్ని, భూమిని వీక్షించవచ్చు. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ ప్రయాణించవచ్చు. అత్యవసర సామగ్రి, ఆక్సిజన్, రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు) ఖర్చవుతుందని హాలో స్పేస్ సంస్థ చెప్తోంది. 2025లో వాణిజ్యపరంగా పర్యటనలను ప్రారంభిస్తామని పేర్కొంది. 2029 నాటికల్లా 400 అంతరిక్షల యాత్రలతో 3 వేల మందిని అంతరిక్షంలోకి తీసుకెళతామని అంటోంది. ఇందులో టూరిస్టులు ఆరు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని హైదరాబాద్ నేషనల్ బెలూన్ ఫెసిలిటీ టెక్నికల్ టీం లీడర్ ప్రసాద్ తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్‌తో ఎలా? వేడిగాలి చల్లటి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలో పైకి వెళ్తుంది. ఈ సూత్రం ఆధారంగానే హాట్ ఎయిర్ బెలూన్ పనిచేస్తుంది. భారీ బెలూన్‌లో వేడి గాలిని నింపి, ఆ వేడిని నియంత్రిస్తూ ఉండటం వల్ల.. ఆకాశంలోకి వెళ్లే ఎత్తు, ప్రయాణాన్ని నియంత్రించవచ్చు. నాణ్యమైన, భారీ బెలూన్లు వందల కిలోల బరువును అంతరిక్షంలోకి కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లగలవు. తర్వాత బెలూన్‌లో గాలిని చల్లార్చడం, తగ్గించడం ద్వారా మెల్లగా కిందికి దిగివచ్చేలా చేయవచ్చు. హాలో స్పేస్ క్యాప్సూల్ ఈ విధానంలోనే పనిచేస్తుంది. మన హైదరాబాదే ఎందుకు? హాలో స్పేస్ సంస్థ రూపొందించిన క్యాప్సూల్ హాట్ ఎయిర్ బెలూన్ సాయంతోనే అంతరిక్షంలోకి వెళుతుంది. అంత ఎత్తులోకి బెలూన్లను ప్రయోగించగల సదుపాయం ఆసియా ఖండం మొత్తంలో మన హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడి బెలూన్ ఫెసిలిటీ సెంటర్లో మాత్రమే ఉంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ఈ కేంద్రం ఉంది. మన దేశంతోపాటు వివిధ దేశాల వాతావరణ, భూసమీప అంతరిక్ష ప్రయోగాల కోసం ఈ ఫెసిలిటీని వినియోగించుకుంటారు. -
రాగల 12 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గోపాల్‌పూర్‌కు 580, కళింగపట్నానికి 660 కీలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం వైపు 14 కీలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయవ్యంగా కదులుతూ రేపు( ఆదివారం) సాయంత్రానికి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం ఉన్నట్లు సూచించారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం రాగల 12 గంటల్లో బలపడి తుఫానుగా మారనుందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అన్నారు. పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర (విశాఖ)- దక్షిణ ఒడిశా(గోపాల్ పూర్) మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు (శనివారం) కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశంఉందని తెలిపారు. రేపు(ఆదివారం) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. రేపు( ఆదివారం) ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 70 -90 కీమీ వేగంతో బలమైన ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుందనిమత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని తెలిపారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. -
తుఫానుగా బలపడనున్న వాయుగుండం
సాక్షి, విజయవాడ: నైరుతి, దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. దాని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కె. కన్నబాబు తెలిపారు. చదవండి: పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు! -
ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ మధ్య మహారాష్ట్ర ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయిల వరకు కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్రకు దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్ఫపీడనం తదుపరి 48 గంటలలో మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు అరేబియా సముద్రం వరకు 18°N ఆక్షాంశాల వెంబడి ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ మధ్య మహారాష్ట్ర దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 1.5కిమీ నుంచి 3.1కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అక్టోబర్ 19వ తేదీన మధ్య అరేబియా సముద్రంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణా కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం ఉత్తర, దక్షిణా కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. -
అరకులో బెలూన్ ఫెస్టివల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ ‘హాట్ బెలూన్ ఫెస్టివల్’కు వేదిక కానుంది. నవంబర్ 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. దీనిలో పాల్గొనడానికి 10 నుంచి 12 విదేశీ సంస్థలు రానున్నాయి. రెండేళ్ల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో, గతేడాది కర్ణాటకలోని హంపి, మైసూర్, బీదర్‌లలో ఆయా రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు ఈ ఫెస్ట్‌ను నిర్వహించాయి. హాట్ ఎయిర్ బెలూన్ సఫారీలో అనుభవం ఉన్న ఢిల్లీకి చెందిన స్కై వాల్జ్ సంస్థ– ఈ ఫాక్టర్ అడ్వెంచర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్‌తో కలసి ఏపీటీడీసీ అరకు హాట్ బెలూన్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. -
గగనపు వీధి వీధిలో!
‘‘మేం నేల మీద ప్రమోట్ చేస్తాం.. అవసరమైతే నింగిలోనూ ప్రమోట్ చేస్తాం... రజనీరా... ఇక్కడ రజనీరా చూడరా...’’ అని సూపర్ స్టార్ అభిమానులు కొత్త డైలాగ్ చెబుతున్నారు. అవును మరి.. రజనీ తాజా చిత్రం ‘2.0’ (‘రోబో’ సీక్వెల్) ప్రమోషన్ని ఆకాశానికెత్తేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పబ్లిసిటీని కూడా అదిరిపోయేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ఏకంగా వంద అడుగుల హాట్ ఎయిర్ బెలూన్ని తయారు చేయించారు. బాసూ... ఈ బెలూన్ ఇండియాకే పరిమితం కాదు. విదేశాలు వెళుతుంది తెలుసా! ‘‘మేం మా ‘2.0’ని హాలీవుడ్ సినిమాలా చూస్తున్నాం. అందుకే విదేశాల్లోనూ ఈ బెలూన్ని ప్రదర్శించాలనుకుంటున్నాం. ప్రపంచంవ్యాప్తంగా జరిగే బెలూన్ ఫెస్టివల్స్కీ మా ‘2.0’ బెలూన్ని పంపిస్తాం. బెలూన్ టెస్టింగ్ కూడా అయిపోయింది. ఇక వాతావరణం అనుకూలించాలి’’ అని లైకా సంస్థ ప్రతినిధి రాజు మహాలింగం పేర్కొన్నారు. విదేశాల్లో లండన్, దుబాయ్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోల్లో ఈ బెలూన్ కనువిందు చేయనుంది. ప్రమోషన్ విషయంలో ఈ టీమ్ రాజీపడాలనుకోవడంలేదు. దుబాయ్‌లో 25 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రం ఆడియో వేడుకను జరపాలనుకుంటున్నారట. రజనీకాంత్, అమీజాక్సన్ జంటగా అక్షయ్‌కుమార్ విలన్‌గా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. -
చైనాలో హాట్ ఏయిర్ బెలూన్స్ కాంపిటీషన్