
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతుంది. వాటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ వేళల్లో మార్పులు చేశారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మిగత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. అధికారులు లక్ష మంది భద్రత సిబ్బందితో పోలింగ్ స్టేషన్‌ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment