
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉద్యమ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మావోయిస్టు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం నూతన కేంద్ర కమిటీని ఎన్నుకుంది. 21 మందితో మావోయిస్టు కేంద్ర కమిటీ జాబితా సిద్ధం చేసింది. నూతన కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి 10 మందికి స్థానం లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరి చొప్పున చోటు దక్కింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పార్టీ సీనియర్ నేత నంబాల కేశవరావును (69) అలియాస్ బస్వరాజ్‌ను ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment