పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు | Firing Between Police And Maoists At Andhra Orissa Border | Sakshi
Sakshi News home page

పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు

Published Sun, Oct 7 2018 6:28 PM | Last Updated on Sat, May 4 2019 11:07 AM

Firing Between Police And Maoists At Andhra Orissa Border - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఒడిశా, విజయనగరం :  కోరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌లోని సుంకి అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు నడుస్తున్నాయి. కాల్పులను ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. కోరాపుట్‌ ఎస్పీ కన్వర్‌ బిశ్వాల్‌ మావోల క్యాంప్‌ను గుర్తించినట్లు ప్రకటించారు.

ఒడిశా స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు, బీఎస్‌ఎఫ్‌ టీంలు ఈ కాల్పుల్లో పాల్గొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఈ కాల్లుల్లో పాల్గొన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement