కడప అర్బన్, న్యూస్‌లైన్ : ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అల వాటు చేస్తామని ఎస్పీ అశోక్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం కడప ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేషన్, ఆర్‌అండ్‌బీ, ఆర్టీఏ అధికారులతో తాము సమావేశమై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే అంశాలన్నింటిపై చర్చలు జరిపామన్నారు.
రాబోయే ఆరు నెలల్లో కడపతోపాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు పట్టణాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వారు కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతోపాటు సీసీ టీవీలను కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారన్నారు. అలాగే కడపలో కూడా సీసీ టీవీలు పెట్టాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ యు.సదాశివయ్య, వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాష, అర్బన్ సీఐ శ్రీనివాసులు, రూరల్ సీఐ రాజగోపాల్‌రెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ పాటించేలా చేస్తాం
Published Thu, Feb 13 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement