కడప కల్చరల్ : జిల్లాకు కొత్త కలెక్టర్‌గా వచ్చిన కేవీ రమణకు స్వాగతం.. జిల్లా నుంచి బదిలీ అయిన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు వీడ్కోలు చెబుతూ శనివారం కడప నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు, జిల్లా అధికారులు ఎస్పీ అశోక్‌కుమార్ సేవలను కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో కొత్త కలెక్టర్ రమణకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారముంటే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.
ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 9 నెలల తన ఉద్యోగ జీవితాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించానని, అందుకు సహకరించిన తమ శాఖతోపాటు రెవెన్యూ శాఖ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో రూ.6లక్షలతో తలపెట్టిన శాశ్వత వేదిక త్వరలో పూర్తవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను క్లబ్ సభ్యులు, జిల్లా అధికారులు, నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, ఓఎస్‌డీ చంద్రశేఖర్‌రెడ్డి, క్లబ్ జిల్లా కార్యదర్శి మనోహర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి నాగరాజు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు స్వాగతం
Published Sun, Jul 27 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement