
వైద్యురాలిని ‘బ్లాగు’కీడ్చాడు!
వేధిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్టు
సిటీబ్యూరో: కొంతకాలంగా వైద్యురాలి వెంటపడి వేధిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చివరకు బ్లాగుల్లోకి ఎక్కి రాద్దాంతం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం నిం దితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథ నం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన అశోక్‌కుమార్ నగరంలోని నారాయణగూడలో నివసిస్తున్నాడు. లండన్‌లో ఎమ్మెస్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజి నీర్‌గా పని చేస్తున్న ఇతనికి కొంతకా లం క్రితం మాట్రిమోనియల్ సైట్ ద్వా రా అమెరికాలో వైద్య విధ్యనభ్యసిం చిన వచ్చిన అంబర్‌పేటకు చెందిన ఓ వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడటంతో కొంతకాలం పాటు సంప్రదింపులు జరిపారు. అని వార్య కారణాల వల్ల కొన్నాళ్లగా ఆమె అశోక్‌కు దూరంగా ఉంటోంది.
దీన్ని జీర్ణించుకోలేకపోయిన అతను వెంట పడి వేధించడం ప్రారంభించాడు. దీం తో ఆమె గతంలోనే అంబర్‌పేట ఠాణా తో పాటు సీసీఎస్‌లో ఫిర్యా దు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఇటీవల మరింత బరితెగించిన అశోక్ కొన్ని బ్లాగుల్లో ఆ వైద్యురాలిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులు చేయడం మొదలెట్టాడు. దీం తో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ పి.రాజు సాంకేతిక ఆధారాలను బట్టి అశోక్‌కుమార్‌ను నిందితుడిగా గుర్తిం చారు. నారాయణగూడలో శుక్రవారం అతడిని అరెస్టు చేశారు.