అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రధాన బుకీలు
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌పై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఆదివారం సాక్షి దినపత్రికలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న తీరుపై ‘ఆడిందే ఆట, పాడిందే పందెం’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై ఎస్పీ స్థానిక పోలీసు అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సాక్షిలో కథనాన్ని చూసి ప్రొద్దుటూరు పోలీసుల్లో చలనం వచ్చినట్లు కనిపించింది. పట్టణంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు స్థానికంగా ఉన్న ప్రధాన బుకీలు ఆదివారం ఉదయం నుంచి రహస్య స్థావరాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులు పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ప్రధాన బుకీలతోపాటు సబ్ బుకీలు కూడా జాగ్రత్త పడటంతో పోలీసులకు ఎవరూ దొరకలేదు.