అందరి కృషితోనే ఎన్నికలు ప్రశాంతం | every one effort,election done peacefully | Sakshi
Sakshi News home page

అందరి కృషితోనే ఎన్నికలు ప్రశాంతం

Published Thu, May 22 2014 1:50 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

every one effort,election done peacefully

ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: హోంగార్డు నుంచి డీఎస్పీ వరకు ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. స్థానిక ఎస్‌కేవీ కల్యాణ మండపంలో బుధవారం రాత్రి నిర్వహించిన పోలీసుల  గెట్ టు గెదర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లి గ్రామసభ లు, అవగాహన సదస్సులు లాంటివి నిర్వహించడం వల్ల పోలింగ్ శాతం పెరగడమేగాక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నా రు. ఒకేసారి మూడు ఎన్నికలు రావడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నారు.
 
 అందరూ బాగా శ్రమించి కడప జిల్లా పోలీసు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా ఇనుమడింపచేశారని కొని యాడారు. ఇదే తరహాలో ఇక నుంచి రోజు వారి విధులు నిర్వహించాలని సూచించా రు. ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న మట్కా, క్రికెట్ బెట్టింగ్‌తోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలన్నారు. ఓఎస్‌డీ చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడటం వల్లే చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాతంగా ఎన్నికలు జరిగాయన్నారు.
 
 జమ్మలమడుగు ఏఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ తనకు ట్రైనింగ్ అయిపోయిన రెండు నెలలకే ఎన్నికలు వచ్చాయన్నారు. ముందుగా ఎన్నికలు అంటే భయపడ్డానని, ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసిన తర్వాత భయం అనేది లేకుండా పోయిందన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్ల కాలంలో పోలీసు శాఖ తరపున గెట్ టు గెదర్‌కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు దారెడ్డి భాస్కర్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, టీవీ సత్యనారాయణ, ఎస్‌ఐలు మహేష్, వెంకటేశ్వర్లు, చలపతి, జీఎం బాషా, నారాయణ యాదవ్, రెడ్డిశేఖర్‌రెడ్డి, లక్ష్మినారాయణ, మస్తాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement