ప్రముఖ లెజెండరీ బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ కూతురు, నటి భారతి జాఫ్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు, నటుడు కమల్‌జీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆమె దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. భారతీ జాఫ్రీ 'హజార్ చౌరాసి కి మా', 'సాన్స్', 'దమన్' వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. భారతి సయీద్ జాఫ్రీ సోదరుడు హమీద్ జాఫ్రీని వివాహం చేసుకున్నారు.
(చదవండి: Raju Srivastava Death: విషాదం.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి)
భారతి మరణవార్త తెలుసుకున్న ప్రముఖ నటి, కొరియోగ్రాఫర్ నందితా దాస్ ఆమెతో కలిసి ఉన్న మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఆమెను చాలా మిస్ అవుతున్నా. భారతీ జాఫ్రీ ఒక మంచి వ్యక్తి. ఆమెను కోల్పోవడం బాధాకరం. భారతి ఆలోచనా విధానం చాలా గొప్పది. చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా." అని అన్నారు. భారతి అల్లుడు కన్వల్ జీత్ సింగ్ అత్తను తలుచుకుంటూ తీవ్ర భావోద్వేగానకి లోనయ్యారు. 'మాకు అన్నీ తానై ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆమె మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బుధవారం ఆమె అంతిమక్రియలు చెంబూర్ క్యాంపులో నిర్వహిస్తాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment