జనాభా స్థిరీకరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు.
కర్నూలు(హాస్పిటల్): జనాభా స్థిరీకరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజేసీ మాట్లాడుతూ జనాభా స్థిరీకరణ కోసం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంభించాలన్నారు.
అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ యు. రాజాసుబ్బారావు మాట్లాడుతూ అధిక జనాభా వల్ల ఇటు కుటుంబం, అటు దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందన్నారు. ఆడ, మగ ఎవరైనా సరే ఇద్దరు పిల్లలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని దేశ సౌభాగ్యానికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పీసీపీఎన్‌డీటీ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ధనుంజయ, డెమో రమాదేవి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూల్ విద్యార్థినిలు పాల్గొన్నారు.