సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కు తీవ్ర అస్వస్థత!
'అభినందన' చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అశోక్ కుమార్ ను చికిత్స కోసం చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన కుమారుడు అకాశ్ అశోక్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
అనారోగ్యానికి సంబంధించిన అంశాలను వైద్యులు వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు. అయితే అశోక్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు ఫోటోగ్రఫిని అశోక్ కుమార్ అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్ కు జాతీయ అవార్డు లభించింది.
హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.