Ashok Kumar Agarwal
-
సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ కన్నుమూత
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మరణించారు. ఆయన గత ఆరు నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని పలు ఆస్పత్రులలో గత ఆరు నెలలుగా ఆయనకు వివిధ చికిత్సలు అందించారు. ఆయన ఆరోగ్యం మరీ విషమించడంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. పలు భారతీయ భాషల్లో దాదాపు వంద సినిమాలకు ఆయన కెమెరామన్‌గా పనిచేశారు. జీన్స్ లాంటి అద్భుతమైన చిత్రాలు ఆయన కెమెరా నుంచి జాలువారినవే. 1980లో 'నెంజాతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. సచ్చాప్యార్ లాంటి హిందీ, బ్యాక్ వాటర్స్ లాంటి ఇంగ్లీషు సినిమాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 1988లో తెలుగులో సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'అభినందన' సహా కొన్ని తమిళ, హిందీ సినిమాలకు కూడా అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలతో కలిసి ఆయన పనిచేశారు. (ఇంగ్లీషు కథనం) -
సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కు తీవ్ర అస్వస్థత!
'అభినందన' చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అశోక్ కుమార్ ను చికిత్స కోసం చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన కుమారుడు అకాశ్ అశోక్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అనారోగ్యానికి సంబంధించిన అంశాలను వైద్యులు వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు. అయితే అశోక్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు ఫోటోగ్రఫిని అశోక్ కుమార్ అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్ కు జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.