త్వరలోనే విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ | AP express will move from vijayawada to new delhi | Sakshi
Sakshi News home page

త్వరలోనే విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్

Published Wed, May 6 2015 10:33 PM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

AP express will move from vijayawada to new delhi

నరసాపురం అర్బన్(గుంటూరు): విజయవాడ-న్యూఢిల్లీ మధ్య త్వరలోనే ఏపీ ఎక్స్‌ప్రెస్ నడపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం (విజయవాడ) అశోక్‌కుమార్ వెల్లడించారు. బుధవారం నరసాపురం ైరె ల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

త్వరలోనే ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ తేదీని ప్రకటిస్తామన్నారు. భీమవరం-విజయవాడ మధ్య చేపట్టిన రైల్వే లైన్ డబ్లింగ్ పనులు మూడేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు విజయవాడ జోన్ పరిధిలో ప్రత్యేక రైళ్లు వేసి, 400 ట్రిప్పులను అదనంగా నడపాలని నిర్ణయించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement