త్వరలోనే విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్
నరసాపురం అర్బన్(గుంటూరు): విజయవాడ-న్యూఢిల్లీ మధ్య త్వరలోనే ఏపీ ఎక్స్‌ప్రెస్ నడపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం (విజయవాడ) అశోక్‌కుమార్ వెల్లడించారు. బుధవారం నరసాపురం ైరె ల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
త్వరలోనే ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ తేదీని ప్రకటిస్తామన్నారు. భీమవరం-విజయవాడ మధ్య చేపట్టిన రైల్వే లైన్ డబ్లింగ్ పనులు మూడేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు విజయవాడ జోన్ పరిధిలో ప్రత్యేక రైళ్లు వేసి, 400 ట్రిప్పులను అదనంగా నడపాలని నిర్ణయించామన్నారు.