భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని కోరుతూ పలువురు అలనాటి మేటి క్రీడాకారులు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వరకు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు.
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని కోరుతూ పలువురు అలనాటి మేటి క్రీడాకారులు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వరకు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. భారత హాకీకి పర్యాయపదంలాంటి దిగ్గజానికి అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని అక్కడికి వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. ధ్యాన్‌చంద్ కుమారుడు, మాజీ హాకీ ఆటగాడు అశోక్ కుమార్ నేతృత్వంలో బారాఖంబా రోడ్ నుంచి మొదలైన మార్చ్‌పాస్ట్ పీఎంఓ కార్యాలయం వరకు సాగింది.
ఇందులో నాటి దిగ్గజాలు జఫర్ ఇక్బాల్, దినేశ్ చోప్రా, రాజేశ్ చౌహాన్, మాజీ కోచ్ హరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. హాకీ ఆటకు వన్నెతెచ్చిన కె.ఆర్ముగమ్, అశోక్‌లిద్దరు పీఎంఓ కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అంజేశారు. భారతరత్న అర్హుల జాబితాలో క్రీడాకారులను చేర్చిన తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు తొలిసారి ఈ అత్యున్నత పౌరపురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దివంగత లెజెండ్‌కూ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది.