సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలి | we need telangana | Sakshi
Sakshi News home page

సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలి

Jan 8 2014 4:37 AM | Updated on Sep 2 2017 2:22 AM

సంపూర్ణ, సామాజిక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మంద అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు.

 ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : సంపూర్ణ, సామాజిక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మంద అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన దీక్షకు సంఘీభావంగా మంగళవారం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేశారు. దీక్షలను ప్రొఫెసర్ మంద అశోక్‌కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ ఉద్యమ ఫలితంగానే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన సూచించారు. సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ వ్యవస్థాపక కన్వీనర్ తిరునహరి శేషు మాట్లాడుతూ రాష్ట్రపతి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్, తీర్మానం ఉండదన్నారు.
 
  చర్చ జరుగకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ బొంగు రాజుయాదవ్, నాయకులు నకిరెకంటి శీనయ్య, తంగెళ్ల పూర్ణేందర్, మల్లోజు సత్యనారాయణచారి, గంగాపురం వేణుమాధవ్, బొంత రామకృష్ణ, చిన్నాల యశ్వంత్‌యాదవ్, ఎర్రబొజ్జు రమేష్, కాటి రఘు, నల్లెల్ల వేణుగోపాల్, ఎల్లావుల సతీష్, రాధాకృష్ణ, ఎండ్ల రాంబాబు, దామెరుప్పుల సతీష్, నెమలిపురి రఘు, రాఘుల శ్రీనివాస్, సాయి, డానియల్, అ మినిశెట్టి రాజేంద్ర, తిరునగరి హరికృష్ణ, రాజ్‌కుమార్, చా గంటి మధుకృష్ణ, కిరణ్, శ్రీనివాస్, కత్తుల దేవరాజు, ఓర్సు రామకృష్ణ, ఎం.రాజు, కె.భరత్ కూర్చున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement