మతపరమైన రిజర్వేషన్లు సరైనవి కాదు | Religious reservation is not valid | Sakshi
Sakshi News home page

మతపరమైన రిజర్వేషన్లు సరైనవి కాదు

Published Tue, Mar 21 2017 7:27 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Religious reservation is not valid

రాజాపూర్: రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు ప్రకటించడం సరైనది కాదని బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు అధికసంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో లేని మతపరమైన రిజర్వేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలిపారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైనార్టీల ఓట్లకోసం సీఎం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ప్రకటించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం కులాలమధ్య చిచ్చు పెట్టేలా చూస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, కన్నా లక్ష్మీనారాయణ, సురేష్, శేఖర్‌గౌడ్, రాజేష్, హతిరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement