religious Reservation
-
కలెక్టరేట్ల దిగ్బంధానికి బీజేపీ పిలుపు
ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు నిరసనగా నేడు ఆందోళనలు సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను పెంచే విషయంపై అసెంబ్లీలో బిల్లును పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దిగ్బంధానికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ రిజర్వేషన్ల విషయంలో సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ధ్వజమెత్తారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం అప్రజా స్వామికంగా ప్రవేశపెట్టిందని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్‌కు.. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. -
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం
రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల కు నిరసనగా సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు భువనేశ్వర్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో తాను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందన్నారు. దీనివల్ల ప్రజల్లో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. కాగా, ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పోరాటాల ద్వారా ఎదుర్కొంటామని లక్ష్మణ్ భువనేశ్వర్ నుంచి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. నేడు నిరసన పాదయాత్ర: శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. -
కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: మతపర రిజర్వేషన్ల విషయంలో కేం ద్రాన్ని సీఎం కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తు న్నారని బీజెఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడరన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్టన్నారు. సీఎంకి అభద్రతా భావం పెరిగిపోయిందని,తన పాలనపైనే అనుమానాలు ఉండడంతో రోజుకో స్కీమ్ ప్రకటిస్తున్నారన్నారు. ఈ నెల 15న బీఏసీ అని, 16న శాసనసభని తమకు సమాచారం వచ్చిందని, ఇంత ఆదరా బాదరాగా ఆదివారం నాడు సభ నిర్వహిం చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిం చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ప్రజాస్వామ్య బద్ధంగా మతపరమైన రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటామన్నారు. ముస్లింలలో కుల వ్యవస్థ లేదని, కులం మతం ప్రకారం వివక్ష చూపటం నిషేధమన్నారు. రాష్ట్రంలో సకాలంలో రుణాలు అందక రైతులు నష్టపోయారని అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాంగోపాల్‌పేట్: మతపరమైన రిజర్వేషన్ల అమలుకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోదని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ ఎస్డీ రోడ్ గ్రాండ్మినర్వా ప్రాంతంలో అకీష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ వాటర్ క్యాంపును ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడులో అమలవుతున్న విధానాలను బేరీజు చేసుకుంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వేసవి కాలంలో బాటసారుల దాహర్తిని తీర్చేందుకు ఇటువంటి కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నిర్వాహకుడు బండపల్లి సతీష్ పాల్గొన్నారు. -
మతపరమైన రిజర్వేషన్లు సరైనవి కాదు
రాజాపూర్: రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు ప్రకటించడం సరైనది కాదని బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు అధికసంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో లేని మతపరమైన రిజర్వేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైనార్టీల ఓట్లకోసం సీఎం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ప్రకటించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం కులాలమధ్య చిచ్చు పెట్టేలా చూస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, కన్నా లక్ష్మీనారాయణ, సురేష్, శేఖర్‌గౌడ్, రాజేష్, హతిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం
కె.లక్ష్మణ్ సంగారెడ్డిజోన్: టీఆర్ఎస్ మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగినం దున ఆ విద్వేషాలు ఇప్పటికీ కొనసాగుతు న్నాయని చెప్పారు. మతపరమైన రిజర్వే షన్లకు వ్యతిరేకంగా సంగా రెడ్డిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తెచ్చిం దని లక్ష్మణ్ అన్నారు. మరోమారు ఈ రిజర్వేషన్లతో ప్రజలను విడదీసే కుట్ర జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంగీకరించేది లేదని స్పష్టం చేశా రు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించా లన్నారు. పేద ముస్లింలకు ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాన వతా దృక్పథంతో స్పందించాలన్నారు.