కలెక్టరేట్ల దిగ్బంధానికి బీజేపీ పిలుపు | BJP call for collectorate Blockade | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ల దిగ్బంధానికి బీజేపీ పిలుపు

Published Mon, Apr 17 2017 1:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP call for collectorate Blockade

ముస్లిం రిజర్వేషన్‌ బిల్లుకు నిరసనగా నేడు ఆందోళనలు

సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం రిజర్వేషన్లను పెంచే విషయంపై అసెంబ్లీలో బిల్లును పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దిగ్బంధానికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ రిజర్వేషన్ల విషయంలో సీఎం  నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ధ్వజమెత్తారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.

మతపరమైన రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం అప్రజా స్వామికంగా ప్రవేశపెట్టిందని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్‌కు.. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement