కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: మతపర రిజర్వేషన్ల విషయంలో కేం ద్రాన్ని సీఎం కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తు న్నారని బీజెఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడరన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్టన్నారు. సీఎంకి అభద్రతా భావం పెరిగిపోయిందని,తన పాలనపైనే అనుమానాలు ఉండడంతో రోజుకో స్కీమ్ ప్రకటిస్తున్నారన్నారు.
ఈ నెల 15న బీఏసీ అని, 16న శాసనసభని తమకు సమాచారం వచ్చిందని, ఇంత ఆదరా బాదరాగా ఆదివారం నాడు సభ నిర్వహిం చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిం చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ప్రజాస్వామ్య బద్ధంగా మతపరమైన రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటామన్నారు. ముస్లింలలో కుల వ్యవస్థ లేదని, కులం మతం ప్రకారం వివక్ష చూపటం నిషేధమన్నారు. రాష్ట్రంలో సకాలంలో రుణాలు అందక రైతులు నష్టపోయారని అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.