మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం | We have religious reservations against | Sakshi
Sakshi News home page

మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం

Published Sat, Apr 15 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం

మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

రాంగోపాల్‌పేట్‌: మతపరమైన రిజర్వేషన్‌ల అమలుకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోదని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌ ఎస్‌డీ రోడ్‌ గ్రాండ్‌మినర్వా ప్రాంతంలో అకీష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్‌ వాటర్‌ క్యాంపును ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడులో అమలవుతున్న విధానాలను బేరీజు చేసుకుంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

వేసవి కాలంలో బాటసారుల దాహర్తిని తీర్చేందుకు ఇటువంటి కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నిర్వాహకుడు బండపల్లి సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement