హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా రెవెన్యూ విభా గం స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.ధర్మారెడ్డి సేవలను తక్షణం విరమించుకుంటున్నట్లు పేర్కొంది. ధర్మారెడ్డికి రంగారెడ్డి జిల్లా డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల సమాచారం.