మల్దకల్, న్యూస్‌లైన్: ఎక్సైజ్‌శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మంగళవారం సాయంత్రం మండలంలోని నీలిపల్లి గ్రామంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుమారు రూ.10 లక్షలు విలువ చేసే సీహెచ్(క్లోరల్ హైడ్రేట్)ను పట్టుకున్నారు.
గద్వాల పట్టణానికి చెందిన అన్వర్ అనే రైతుకు నీలిపల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తిపంటను సాగుచేస్తున్నాడు. పొలంలో వేసిన షెడ్డులో సీహెచ్‌ను భద్రపర్చి కల్లు వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు. అయిజ, మల్దకల్, గట్టు, అలంపూర్ తదితర ప్రాంతాల్లోని కల్లు వ్యాపారులకు ఈ సీహెచ్‌ను సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. షెడ్డులో ఉంచిన 20.40 క్వింటాళ్ల సీహెచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 70 బస్తాలు ఉన్నాయి. ఒక్కోబస్తాలో 30 కేజీల సీహెచ్ ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు వివరించారు.
దీనిద్వారా కృత్రిమకల్లును తయారుచేస్తారని పేర్కొన్నారు. దాడిచేసిన సమయంలో పొలం వద్ద ఉన్న రైతు అన్వర్ పరారైనట్లు తెలిపారు. అన్వర్‌పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ చెప్పారు. ఈ దాడుల్లో ఏఎస్ వివేక్, ఎక్సైజ్ సీఐలు నాగార్జునరెడ్డి, రాధాకృష్ణ, రాకేష్, మధుబాబు, ఎస్‌ఐ జ్ఞానయ్య, సిబ్బంది నాతానియల్, రాజేందర్, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ బాబు పాల్గొన్నారు.
నాటుసారా బట్టీలపై మెరుపుదాడులు
గోపాల్‌పేట, న్యూస్‌లైన్: మండలంలోని పలు గిరిజన తండాల్లో మంగళవారం ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్‌ఐ షాకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్, ఈఎస్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి భారీగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటుసారా ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అ ముడాలకుంట తండాలో దాడి చేసి నాలుగువేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 90 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే ధర్మ్యాతండాలో 18 వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరు తం డాలో 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఒకరిపై కేసునమోదుచేశారు. ఏదులలో 630 నాటుసారా ప్యాకెట్లను స్వా ధీనం చేసుకుని ముగ్గురి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణుడు, సిబ్బంది భగవంత్‌గౌడ్, బాల య్య, సాధిక్, వసురాం, ఈఎస్‌పీఎఫ్ సిబ్బంది ప్రకా ష్, వీరకుమార్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, దూద్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ కొరడా
Published Wed, Nov 20 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement