Gopal peta
-
గోపాల్‌పేటలో దొంగల హల్చల్
నాగిరెడ్డిపేట : మండలంలోని గోపాల్‌పేటలో శనివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు ఎనిమిది ఇళ్ల తాళాలు పగులగొట్టి కలకలం సృష్టించారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్‌పేటలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కంచరి భూపాల్‌తో పాటు మండలంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ గోపాల్‌పేటలో అద్దెకుంటున్న సంతోష్, రమేష్, శ్రీహరి ఇళ్ల తాళాలను దొంగలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వీరితో పాటు ఎస్సీ కాలనీలో నివాసముంటున్న పరమల్ల రాములు, ఇదే గ్రామంలో అద్దెకుంటున్న ట్రాన్స్‌కో సబ్‌ఇంజినీర్ సత్యనారాయణగౌడ్, చాకలి రాజు ఇంటి తాళాలను పగులగొట్టి చోరీకి దిగారు. నాగిరెడ్డిపేటలోని జయంత్‌రెడ్డి ఇంటి తాళాలను సైతం ధ్వంసం చేసి ఇంట్లోని ఇత్తడి సామాగ్రిని ఎత్తుకెళ్లారు. గోపాల్‌పేటలో జరిగిన చోరీలో సంతోష్‌కు చెందిన రెండు సెల్ఫోన్లు, రమేష్ ఇంట్లో రూ.2వేల నగదు, రాములుకు చెందిన 4 తులాల వెండి, అరతులం బంగారంతో పాటు రూ.వెయ్యి నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. దీంతో పాటు సంతోష్ ఇంట్లో నుంచి ఎల్ఈడీ టీవీనీ అపహరించేందుకు ప్రయత్నించి కుదరకపోయే సరికి పక్కనే ఉన్న కుర్చీలో పెట్టి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాగిరెడ్డిపేట ఏఎస్సై కిష్టయ్య తెలిపారు. రెండు ఇళ్లలో పట్టపగలే చోరీ.. మండలంలోని గోపాల్‌పేటలో శనివారం పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గోలిలింగాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ గోపాల్‌పేటలో అద్దెకుంటున్న సంతోష్ తన ఇంటికి శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో తాళంవేసి రామాయంపేటలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు మధ్యాహ్నం సమయంలోనే ఇంటి తాళాలు పగులగొట్టి పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన పక్కింటివారు మరో తాళం వేశారు. విషయం తెలుసుకున్న సంతోష్ శనివారం మధ్యాహ్నమే తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తిం చారు. దీంతోపాటు సమీపంలోనే ఉన్న ట్రాన్స్ కో సబ్‌ఇంజినీర్ సత్యనారాయణగౌడ్ గది తాళాలను సైతం శనివారం మధ్యాహ్నమే పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించి వస్తువులను చిందరవందరగా చేసి వెళ్లిపోయారు. విధుల నుంచి తిరిగి వచ్చిన సత్యనారాయణ తన గది తాళాలు పగులగొట్టి ఉండడాన్ని చూసి నివ్వెరపోయారు. ఇంట్లోకి వెళ్లి చూడగా విలువైన వస్తువు లు అపహరణకు గురవకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా రు. కాగా పట్టపగలే మండలకేంద్రంలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు కలవరపడుతున్నారు. -
కాటేసిన కరెంట్
నిండు నూరేళ్ల సంసార జీవితం కళకళలాడుతుందనుకున్న ఓ నవ వధువును కరెంట్ కాటేసింది. పెళ్లైన పది రోజులు కూడా గడవకముందే విద్యాదాఘాతం బలితీసుకుంది. తమ కూతురిని అత్తారింటికి సాగనంపుతున్నామన్న ఆమె తల్లి దండ్రుల ఆనందం ఆవిరైంది. కాళ్ల పారాని ఆరకముందే మృత్యు ఒడికి చేరుకోవడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. - న్యూస్‌లైన్, బల్మూర్ మండల పరిధిలోని పోలేపల్లిలో శుక్రవారం ఓ నవవధువును విద్యుదాఘాతం బలితీసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ర్యాపని శ్రీనివాసులు, అలివేలమ్మల కూతురు బంగారమ్మ(21)కు ఈనెల 22న గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామానికి చెందిన కురుమూర్తితో వివాహమైంది. భార్యను అత్తారింటికి తీసుకెళ్లేందుకు గురువారం రాత్రి భర్త కురుమూర్తి పోలేపల్లికి వచ్చాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో బంగారమ్మ బండలు శుభ్రపరుస్తుండగా టీవీ ప్లగ్ వైరుపై నీళ్లు బండలకు విద్యుత్ ప్రవహించడంతో ఆమె కింద పడిపోయింది. కాపాడేందుకు వెళ్లిన భర్తకూ స్వల్ప గాయూలయ్యూరుు. బంగారమ్మను అచ్చంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. మృతురాలి తల్లి అలివేలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ నవీన్‌సింగ్ తెలిపారు. కాగా గ్రామంలో ఎర్తింగ్ సమస్య తీవ్రంగా ఉందని గతంలో కూ డా ఇద్దరు విద్యుదాఘాతంతో మృతిచెం దారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. విద్యుత్ అధికారులు బాధ్యత వహించి మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు. -
గంగమ్మా...కానరావమ్మా..!
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాల తీరు కాస్త నిలకడగా ఉన్నా ఆందోళనకర పరిస్థితులు మాత్రం తలెత్తుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా జలాలు అందడం లేదు. అధికారులు ప్రత్యామ్నాయమని చెప్తున్నా వాస్తవంలో ఆ ఏర్పాట్లు ఫలితాల్నివ్వడం లేదు. కొన్ని మండలాల్లో ఈ నెలలో మరీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. నీటి ఎద్దడితో పల్లెలు అల్లాడుతున్నాయి. ఏదో ఒకటి చేసి ఆదుకోమని అధికారులను కోరుతున్నాయి. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో భూగర్భ జలమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈనెల 17 నుంచి 23 (శుక్రవారం) వరకు 39.03 డిగ్రీల నుంచి 40.03 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత జిల్లాలో నమోదైంది. ఈ తీవ్రత భూగర్భ జలాలపైనా పడి ఆందోళనకర పరి స్థితులు తలెత్తుతున్నాయి. మార్చి మా సంలో భూగర్భ జలమట్టం 10.30 మీట ర్లకు పడిపోగా ఏప్రిల్ నాటికి నీటి మట్టం 11.02 మీటర్లకు దిగిపోయింది. ఈ మే నెలలోనైతే మరీ దిగజారి పోయింది. ఇక గత ఏడాది మార్చిలో భూగర్భ జలమట్టం 15.02 మీటర్లు ఉండగా ఏప్రిల్‌లో 14.54 మీటర్లు కనిపించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వాన పడటం వల్ల గతేడాదితో పోల్చితే భూగర్భ జలాలు నిలకడగానే ఉన్నప్పటికీ.. ఆందోళన కర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని 36 ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం 10 మీటర్ల లోతుకు పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా ధరూరు మండలంలో భూగర్భ జలమట్టం 36.32 మీటర్లకు పడిపోయింది. అదేవిధంగా బిజినేపల్లి మండలంలో 22.33 మీటర్లు నమోదుకాగా కల్వకుర్తిలో 23.58 మీటర్లు కొడంగల్ మండలం రుద్రారంలో 18.54 మీటర్లు, మహబూబ్‌నగర్ మండలం ఏనుగొండలో 18.30 మీటర్లు, మిడ్జిల్‌లో 23.52 మీటర్లు, నర్వలో 20.89 మీటర్లు, వెల్దండలో 22.14 మీటర్లు తాడూరులో 23.07 మీటర్లు, తలకొండపల్లిలో 19.90 మీటర్లు భూగర్భ జలమట్టం నమోదైంది. అదేవిధంగా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో 13.31 మీటర్లు, బాలానగర్ మండలం రాజాపూర్‌లో 19.40 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది. బల్మూరు, వెల్కిచర్ల, దేవరకద్ర, ఇదే మండలంలోని మీన్గవానిపల్లిలో, మరికల్, కొండాపూర్, గోపాల్పేట మండలంలోని ఎద్దుట్ల, ఐజ, జడ్చర్ల, తుర్కదిన్నె, కొడంగల్, కోస్గి, కానాయపల్లి, అంబట్పల్లి, మాగనూరు, కోడూరు, కొత్తపల్లి, కొల్లంపల్లి, నారాయణపేట, పాన్‌గల్ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పది మీటర్ల కంటే లోతుకు పడిపోయింది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి జిల్లాలో ఇప్పటికే రెండు వేలకు పైగా చేతి పంపులు వట్టిపోయాయి. 26 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అధికార యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని 745 మంచినీటి పథకాల ద్వారా అరకొరగా మంచినీటిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 312 ఫ్లోరైడ్ ప్రవహిత గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఎండలు ఇదే విధంగా కొనసాగినట్లయితే భూగర్భ జలమట్టం మరింత లోతుకు పడిపోవడం వల్ల చేతి పంపులు, మంచినీటి పథకాలకు సంబంధించిన బావులు ఇంకిపోయే ప్రమాదం ఏర్పడనుంది. అదేవిధంగా చేతికి అందివచ్చిన పంటలకు సాగునీరందని పరిస్థితి నెలకొని ఉంది. -
‘కోత’లపై కన్నెర్ర
గోపాల్పేట, న్యూస్‌లైన్: గురువారం మండలంలోని కేశంపేట రైతులు చెన్నారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి, తొమ్మిది గంటల పా టు ఆందోళన చేశారు. ఏఈ శ్రీనివాస్‌బాబు, ఇ తర సిబ్బందిని కంట్రోల్ గదిలో నిర్బం ధించారు. వివరాల్లోకి వెళితే...అరకొర విద్యుత్ తో రబీలో సాగుచేసిన వేరుశనగ పంట ఎండుతోందని ఆగ్రహించిన కేశంపేట రైతులు చెన్నా రం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కంట్రోల్ గదిలోని రిజిస్టర్‌ను పరిశీలించి, ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వకుండా ఏడు గంటలు ఇస్తున్నట్లు రాశారని మండిపడ్డారు. కంట్రోల్ గదిని మూసి రైతులు ఆందోళనకు దిగారు. సంబంధిత ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని తేల్చిచెప్పారు. అక్కడే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. లైన్మెన్ అందుబాటులో ఉండటం లేదని, ఏఈ గ్రామానికి అసలు రావడం లేదని ఆరోపించారు. పేరుకే ఏడుగంటలు చెబుతూ ఇష్టానుసారం కోతలు విధిస్తుండటంలో మోటార్లు ఎలా నడుస్తాయని రైతులు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఏఈ శ్రీనివాస్‌బాబు అక్కడికి చేరుకుని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. ఏడీ వచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఏఈ, లైన్ మన్ కుర్మయ్య, జేఎల్ఎం వెంకట్‌రెడ్డి, సీఎల్ శివ, ఆపరేటర్ గోపాల్‌లను అరగంట పాటు కంట్రోల్ గదిలో నిర్బంధించారు. అరగంట తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఏఈ, ఇతర సిబ్బందిని విడి పించారు. అయినా రైతులు ఎంత చెప్పినా వినకుండా రోడ్డుపై బైఠాయించి, ఆందోళన కొనసాగించారు. చివరికి కొల్లాపూర్ ఏడీ చక్రవర్తి వచ్చి వారితో మాట్లాడారు. ఏదుట్ల ఫీడర్‌కు కేశంపేట కనెక్షన్ ఉందని, దీని వల్ల ఓవర్‌లోడ్‌తో ఇన్కమింగ్ పోతుందని ఏడీకి ఏఈ వివరించారు. వారం రోజుల్లో కేశంపేటకి సంబంధించిన కనెక్షన్‌ను వేరు చేసి నాణ్యమైన కరెంటును ఇస్తామని ఏడీ రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కేశంపేట సర్పంచ్ రాంబాబు, మాజీ సర్పంచు రాంకిషన్‌రావు, దశరథ రామారావు, సురేష్‌గౌడ్, సత్యారెడ్డి, బిచ్చిరెడ్డి, గొల్లపల్లికి చెందిన అర్జున్‌రావు, వంతమంది రైతులు పాల్గొన్నారు. మాదారం సబ్‌స్టేషన్ ముట్టడి మిడ్జిల్: మండలంలోని మాదారం సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని రైతులు ఆగ్రహించి గురువారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కోళ్ల పరిశ్రమలకు క రెంట్ సరఫరా చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే తాము వ్యవసాయం ఎలా చేయాలని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న డీఈ సుభాష్, ఏఈ రాంప్రసాద్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే యత్నం చేశారు. సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ స్థాయి తక్కువగా ఉండటంతో సరఫరాలో అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. అలాగైతే కోళ్ల పరిశ్రమలకు కరెంట్ నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేయడంతో, అందుకు అధికారులు ఒప్పుకున్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఊర్కొండ సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ సమస్య తీర్చాలని ఊర్కొండ, ముచ్చర్లపల్లి రైతులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
ఎక్సైజ్ కొరడా
మల్దకల్, న్యూస్‌లైన్: ఎక్సైజ్‌శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మంగళవారం సాయంత్రం మండలంలోని నీలిపల్లి గ్రామంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుమారు రూ.10 లక్షలు విలువ చేసే సీహెచ్(క్లోరల్ హైడ్రేట్)ను పట్టుకున్నారు. గద్వాల పట్టణానికి చెందిన అన్వర్ అనే రైతుకు నీలిపల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తిపంటను సాగుచేస్తున్నాడు. పొలంలో వేసిన షెడ్డులో సీహెచ్‌ను భద్రపర్చి కల్లు వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు. అయిజ, మల్దకల్, గట్టు, అలంపూర్ తదితర ప్రాంతాల్లోని కల్లు వ్యాపారులకు ఈ సీహెచ్‌ను సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. షెడ్డులో ఉంచిన 20.40 క్వింటాళ్ల సీహెచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 70 బస్తాలు ఉన్నాయి. ఒక్కోబస్తాలో 30 కేజీల సీహెచ్ ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు వివరించారు. దీనిద్వారా కృత్రిమకల్లును తయారుచేస్తారని పేర్కొన్నారు. దాడిచేసిన సమయంలో పొలం వద్ద ఉన్న రైతు అన్వర్ పరారైనట్లు తెలిపారు. అన్వర్‌పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ చెప్పారు. ఈ దాడుల్లో ఏఎస్ వివేక్, ఎక్సైజ్ సీఐలు నాగార్జునరెడ్డి, రాధాకృష్ణ, రాకేష్, మధుబాబు, ఎస్ఐ జ్ఞానయ్య, సిబ్బంది నాతానియల్, రాజేందర్, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ బాబు పాల్గొన్నారు. నాటుసారా బట్టీలపై మెరుపుదాడులు గోపాల్పేట, న్యూస్‌లైన్: మండలంలోని పలు గిరిజన తండాల్లో మంగళవారం ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్ఐ షాకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్, ఈఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి భారీగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటుసారా ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అ ముడాలకుంట తండాలో దాడి చేసి నాలుగువేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 90 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే ధర్మ్యాతండాలో 18 వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరు తం డాలో 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఒకరిపై కేసునమోదుచేశారు. ఏదులలో 630 నాటుసారా ప్యాకెట్లను స్వా ధీనం చేసుకుని ముగ్గురి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణుడు, సిబ్బంది భగవంత్‌గౌడ్, బాల య్య, సాధిక్, వసురాం, ఈఎస్పీఎఫ్ సిబ్బంది ప్రకా ష్, వీరకుమార్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, దూద్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.