నిండు నూరేళ్ల సంసార జీవితం కళకళలాడుతుందనుకున్న ఓ నవ వధువును కరెంట్ కాటేసింది. పెళ్లైన పది రోజులు కూడా గడవకముందే విద్యాదాఘాతం బలితీసుకుంది. తమ కూతురిని అత్తారింటికి సాగనంపుతున్నామన్న ఆమె తల్లి దండ్రుల ఆనందం ఆవిరైంది. కాళ్ల పారాని ఆరకముందే మృత్యు ఒడికి చేరుకోవడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.
- న్యూస్‌లైన్, బల్మూర్
మండల పరిధిలోని పోలేపల్లిలో శుక్రవారం ఓ నవవధువును విద్యుదాఘాతం బలితీసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ర్యాపని శ్రీనివాసులు, అలివేలమ్మల కూతురు బంగారమ్మ(21)కు ఈనెల 22న గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామానికి చెందిన కురుమూర్తితో వివాహమైంది. భార్యను అత్తారింటికి తీసుకెళ్లేందుకు గురువారం రాత్రి భర్త కురుమూర్తి పోలేపల్లికి వచ్చాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో బంగారమ్మ బండలు శుభ్రపరుస్తుండగా టీవీ ప్లగ్ వైరుపై నీళ్లు బండలకు విద్యుత్ ప్రవహించడంతో ఆమె కింద పడిపోయింది.
కాపాడేందుకు వెళ్లిన భర్తకూ స్వల్ప గాయూలయ్యూరుు. బంగారమ్మను అచ్చంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. మృతురాలి తల్లి అలివేలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ నవీన్‌సింగ్ తెలిపారు. కాగా గ్రామంలో ఎర్తింగ్ సమస్య తీవ్రంగా ఉందని గతంలో కూ డా ఇద్దరు విద్యుదాఘాతంతో మృతిచెం దారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. విద్యుత్ అధికారులు బాధ్యత వహించి మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు.
కాటేసిన కరెంట్
Published Sat, May 31 2014 2:56 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement