గోపాల్‌పేట, న్యూస్‌లైన్: గురువారం మండలంలోని కేశంపేట రైతులు చెన్నారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి, తొమ్మిది గంటల పా టు ఆందోళన చేశారు. ఏఈ శ్రీనివాస్‌బాబు, ఇ తర సిబ్బందిని కంట్రోల్ గదిలో నిర్బం ధించారు. వివరాల్లోకి వెళితే...అరకొర విద్యుత్ తో రబీలో సాగుచేసిన వేరుశనగ పంట ఎండుతోందని ఆగ్రహించిన కేశంపేట రైతులు చెన్నా రం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కంట్రోల్ గదిలోని రిజిస్టర్‌ను పరిశీలించి, ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వకుండా ఏడు గంటలు ఇస్తున్నట్లు రాశారని మండిపడ్డారు. కంట్రోల్ గదిని మూసి రైతులు ఆందోళనకు దిగారు. సంబంధిత ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని తేల్చిచెప్పారు.
అక్కడే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. లైన్‌మెన్ అందుబాటులో ఉండటం లేదని, ఏఈ గ్రామానికి అసలు రావడం లేదని ఆరోపించారు. పేరుకే ఏడుగంటలు చెబుతూ ఇష్టానుసారం కోతలు విధిస్తుండటంలో మోటార్లు ఎలా నడుస్తాయని రైతులు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఏఈ శ్రీనివాస్‌బాబు అక్కడికి చేరుకుని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. ఏడీ వచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఏఈ, లైన్ మన్ కుర్మయ్య, జేఎల్‌ఎం వెంకట్‌రెడ్డి, సీఎల్ శివ, ఆపరేటర్ గోపాల్‌లను అరగంట పాటు కంట్రోల్ గదిలో నిర్బంధించారు. అరగంట తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఏఈ, ఇతర సిబ్బందిని విడి పించారు.
అయినా రైతులు ఎంత చెప్పినా వినకుండా రోడ్డుపై బైఠాయించి, ఆందోళన కొనసాగించారు. చివరికి కొల్లాపూర్ ఏడీ చక్రవర్తి వచ్చి వారితో మాట్లాడారు. ఏదుట్ల ఫీడర్‌కు కేశంపేట కనెక్షన్ ఉందని, దీని వల్ల ఓవర్‌లోడ్‌తో ఇన్‌కమింగ్ పోతుందని ఏడీకి ఏఈ వివరించారు. వారం రోజుల్లో కేశంపేటకి సంబంధించిన కనెక్షన్‌ను వేరు చేసి నాణ్యమైన కరెంటును ఇస్తామని ఏడీ రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కేశంపేట సర్పంచ్ రాంబాబు, మాజీ సర్పంచు రాంకిషన్‌రావు, దశరథ రామారావు, సురేష్‌గౌడ్, సత్యారెడ్డి, బిచ్చిరెడ్డి, గొల్లపల్లికి చెందిన అర్జున్‌రావు, వంతమంది రైతులు పాల్గొన్నారు.
మాదారం సబ్‌స్టేషన్ ముట్టడి
మిడ్జిల్: మండలంలోని మాదారం సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని రైతులు ఆగ్రహించి గురువారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కోళ్ల పరిశ్రమలకు క రెంట్ సరఫరా చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే తాము వ్యవసాయం ఎలా చేయాలని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న డీఈ సుభాష్, ఏఈ రాంప్రసాద్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే యత్నం చేశారు. సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ స్థాయి తక్కువగా ఉండటంతో సరఫరాలో అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. అలాగైతే కోళ్ల పరిశ్రమలకు కరెంట్ నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేయడంతో, అందుకు అధికారులు ఒప్పుకున్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఊర్కొండ సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ సమస్య తీర్చాలని ఊర్కొండ, ముచ్చర్లపల్లి రైతులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
‘కోత’లపై కన్నెర్ర
Published Fri, Dec 27 2013 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement