Exercise officers
-
ఉల్లంఘన!
సాక్షి, గుంటూరు: జిల్లాలో మద్యం ధరలు మండిపోతున్నాయి. కొత్త పాలసీ ద్వారా దుకాణాలు కేటాయించి వారం గడవకముందే ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు జరపాలని, బెల్టుషాపులు ఉండకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ దుకాణాల నిర్వాహకులకు ఇవేమీ పట్టడం లేదు. పగటి వేళ క్వార్టర్‌పై ఎమ్మార్పీ కంటే రూ. 15 నుంచి రూ. 20 వరకు, రాత్రి సమయాల్లో రూ. 20 నుంచి రూ. 40 వరకు ధర పెంచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఎక్సయిజ్ అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుండటం నిర్వాహకులకు వరంగా మారింది. అధిక ధరలు ఏమిటని ప్రశ్నించిన మందుబాబులకు అధికారులకు నెలవారి ముడుపులు చెల్లిస్తున్నామని దుకాణదారులు బహిరంగానే చెబుతుండటం ఇందుకు నిదర్శనం. బలహీనతను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 342 మద్యం దుకాణాలకు 313 దుకాణాలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరపాలంటూ మందుబాబులు ఎక్కడైనా హడావిడి చేస్తే వెంటనే ప్రధాన బ్రాండ్లన్నీ పక్కనబెట్టి ఎవ్వరికీ తెలియని బ్రాండ్లను కౌంటర్లలో పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు. మందుబాబులు వారికి కావాల్సిన బ్రాండ్లను మాత్రమే తాగుతారని తెలిసిన మద్యం వ్యాపారులు వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సయిజ్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో బెల్టు షాపులు... టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే బెల్టుషాపులు రద్దుచేస్తూ ఫైలుపై సంతకం చేసినప్పటికీ ఇంకా మారుమూల గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలు బలంగా ఉన్న గ్రామాల్లో బెల్టులను తొలగించడం ఎక్సైజ్ అధికారులకు కత్తిమీద సాములా మారింది. మనకెందుకొచ్చిన గొడవలే అంటూ చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. దీనికితోడు అనేక ప్రాంతాల్లో మద్యం సిండికేట్లు టీడీపీ నేతలకు సంబంధించినవి కావడంతో ఇక్కడ వారు ఆడిందేఆట.. పాడిందేపాటగా మద్యం వ్యాపారం నడుస్తోంది. అర్ధరాత్రి వరకూ అమ్మకాలు... మద్యం దుకాణాల నిర్వాహకులు రాత్రి 10 గంటలకు దాటితే షట్టర్లకు తాళాలు వేసి దొడ్డిదారిన మద్యం విక్రయాలు జరుపుతున్నారు. చిన్నచిన్న బడ్డీ బంకులను రాత్రి 10 గంటలకల్లా మూసివేయించే పోలీసులు మద్యం విక్రయాలను మాత్రం పట్టించుకోవడంలేదు. రాత్రి సమయాల్లో అక్రమంగా మద్యం వ్యాపారం కొనసాగించేందుకు పోలీసులకు జీపు డ్రైవర్ నుంచి అధికారి స్థాయి వరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రతినెలా అందజేస్తున్నట్లు సమాచారం. -
‘మద్యం’కోలాహలం
ఏటీ అగ్రహారం : జిల్లాలోని 309 మద్యం దుకాణాల లెసైన్సులను ఎక్సైజ్ అధికారులు లాటరీ విధానంలో వ్యాపారులకు కేటారుుంచారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 342 దుకాణాలు ఉండగా 309 దుకాణాలకు 6,133 దరఖాస్తులు అందాయి. దుకాణాల కేటారుుంపుతో ప్రభుత్వానికి రూ.136.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. పల్నాడు ప్రాంతంలోని దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఆ ప్రాంతంలోని నడికుడి గ్రామ దుకాణానికి అత్యధికంగా 223 దరఖాస్తులు అందాయి. గుంటూరు ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని దుకాణాలకు 1434, నరసరావుపేట డివిజన్ పరిధిలో 3848, తెనాలి డివిజన్ పరిధిలోని దుకాణాలకు 852 దరఖాస్తులు దాఖలయ్యూరుు. పల్నాడు ప్రాంతంలోని అడిగొప్పల దుకాణానికి 150, కొండమోడు జంక్షన్ దుకాణానికి 143 దరఖాస్తులు వచ్చారుు. జిల్లాలోని 50 దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తే రాగా 10 దుకాణాలకు రెండేసి పడ్డాయి. తొలుత ఒక్కొక్క దరఖాస్తు వచ్చిన దుకాణాలను వ్యాపారులకు కేటారుుంచారు. తర్వాత రెండేసి, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన దుకాణాల లెసైన్సులను లాటరీ పద్ధతిలో కేటారుుంచారు. ఉదయం ప్రారంభమైన ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. దుకాణాలు పొందిన వ్యాపారులు లెసైన్స్ ఫీజులో మూడో వంతు సొమ్మును అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో చెల్లించారు. అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.కుళ్ళాయప్ప, మెప్మా పీడీ ఢిల్లీరావు, ఆర్డీవో రామ్మూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఆదినారాయణమూర్తి, మహేష్‌కుమార్, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అరకొర ఏర్పాట్లతో పాట్లు ఈ కార్యక్రమం కోసం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉండటంతో వ్యాపారులు ఇక్కట్లు పడ్డారు. కుర్చీలు సరిపోక గంటల తరబడి క్యూలో నిలబడాల్సిరావటంతో అసహనం వ్యక్తం చేశారు. కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని వాపోయూరు. -
షాపు మీదైనా.. వాటా మాదే!
సాక్షి, గుంటూరు: టీడీపీ నేతల బరితెగింపునకు అడ్డూ అదుపూ ఉండటం లేదు. అధికార మదంతో రెచ్చిపోతున్న వారి ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాజాగా వారు.. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసినవారిపై దౌర్జన్యకాండకు దిగారు. ఎక్సైజ్ అధికారులు వీరికి సహకరిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ‘ఫలానా మద్యం షాపులు మాకే కావాలి. వాటికసలు దరఖాస్తే చేయొద్దు.. ఒకవేళ దరఖాస్తు చేసినా, లాటరీలో మద్యం దుకాణం మీకొస్తే అందులో సగం వాటా మాకివ్వాల్సిందే. మా మాట కాదని ఎక్కువ చేస్తే వ్యాపారం ఎలా చేస్తారో మేమూ చూస్తాం..’ అని దరఖాస్తుదారులను బెదిరిస్తున్నారు. మద్యం దుకాణాల లెసైన్సుల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ స్పందిస్తూ ఎంతోమంది వ్యాపారులు డీడీలు తీసి దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చారు. వీరి స్థాయిని బట్టి మండల స్థాయి టీడీపీ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే దుకాణాలను గుర్తించి వాటికెవరూ పోటీ పడొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, పత్తిపాడు, సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో గిరాకీ ఉన్న మద్యం దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు రాకుండా చూసేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పవచ్చు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓ దుకాణం రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరొందింది. గతంలో ఈ దుకాాణాన్ని రూ.5.2 కోట్లకు అక్కడి వ్యాపారులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ దుకాణాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు అక్కడి వ్యాపారులపై తీవ్రస్థారుులో ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొందరైతే ఒకడగు ముందుకేసి ఎక్సయిజ్ అధికారుల ద్వారా రాయబారాలు నడుపుతున్నారు. ఎక్కడైనా టీడీపీ సిండికేట్లే ఉండాలట... జిల్లాలోని ఏ మండలంలో ఎవరికి షాపులు వచ్చినా వాటిలో పార్టీవారికి వాటాలు ఇచ్చి తీరాలని, తమ ఆధ్వర్యంలో మాత్రమే సిండికేట్లు ఏర్పాటవ్వాలన్నది టీడీపీ నేతల లక్ష్యం. ఏ పార్టీకి చెందినవారైనా స్లీపింగ్ పార్టనర్లుగా మాత్రమే ఉండాలని.. పెత్తనమంతా తమవారే చేస్తారని.. లేదంటే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది వ్యాపారులు అసలు దరఖాస్తే చేయలేదని సమాచారం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. ఎప్పటినుంచో మద్యం వ్యాపారం చేస్తున్న తాము ఎవరి దయాదాక్షిణ్యాలపైనో బతకాల్సిన అవసరం లేదంటూ టీడీపీ నేతలపై వ్యాపారులు మండిపడుతున్నారు. అధికారులపై పెరుగుతున్న ఒత్తిళ్లు.. తమకు కావాల్సిన దుకాణాలకు దరఖాస్తు చేసినవారి వివరాలను వెంటవెంటనే చెప్పాలంటూ టీడీపీ నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు దరఖాస్తుదారుల అడ్రస్ తెలుసుకుని వారిని నయానో భయానో ఒప్పించి లాటరీ తగిలినా ఆ షాపును తమకు అమ్మే విధంగా మంతనాలు సాగిస్తున్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతలకే దక్కితే భవిష్యత్తులో వారు అక్రమాల పాల్పడినా తామేం చేయలేని పరిస్థితి ఎదురవుతుందని కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
బోణీయే కాలేదు
సాక్షి, గుంటూరు: మద్యం దుకాణాలకు కొత్త లెసైన్సులు పొందేందుకు ఎక్సయిజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. నూతన మద్యం విధానం ఖరారు కాగానే సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జరీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దరఖాస్తులు స్వీకరించేందుకు ఎక్సయిజ్ అధికారులు గుంటూరులోని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రం వరకూ ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. గత ఏడాది దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రకటించగానే ఎక్సయిజ్ డీసీ కార్యాలయం ముందు బారులు తీరిని వ్యాపారులు ఈసారి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు, 187 బార్లు ఉన్నాయి. గతేడాది నిర్వహించిన లాటరీల్లో 34 మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజులు చెల్లించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. గతేడాది పోటీ అధికంగా ఉంటేనే పరిస్థితి అలా ఉంటే ఈ ఏడాది పరిస్థితి చూస్తుంటే జిల్లాలో ఎన్ని మద్యం దుకాణాలు ఖాళీగా ఉంటాయో అర్ధం కావడంలేదని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు. మూడు శ్లాబుల్లో మద్యం దుకాణాలకు గతేడాది కంటే మూడు, నాలుగు లక్షల రూపాయాలు లెసైన్స్ ఫీజులు పెంచడం, బెల్టు షాపులను రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వంటి కారణాలతో మద్యం వ్యాపారుల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. గతేడాది బెల్టు షాపులు ఏర్పాటుచేసి వ్యాపారాలు చేస్తేనే నష్టపోకుండా బయటపడగలిగామని, ఈసారి అవి కూడా లేకుండా వ్యాపారం ఎలా నిర్వహించాలని వీరంతా తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం మంచి రోజు కాకపోవడంతో వ్యాపారులు ఎవరూ రాలేదని, బుధవారం నుంచి భారీగానే దరఖాస్తులు వస్తాయని మరికొందరు చెబుతున్నారు. -
సారాపై యువకుల సమరం
అమరచింత, న్యూస్‌లైన్ : నిత్యం జనంతో కిటకిటలాడే ఆలయం ప్రాంగణం వద్ద సారా విక్రయాలు అరికట్టాలని ఆ కాలనీ యువత నడుం బిగించింది.. అందుకు మహిళల మద్దతూ లభించింది.. చివరకు అమ్మకాలు వద్దంటూ గిరిజనులతో వాగ్వాదానికి దిగి తరిమేశారు.. వివరాల్లోకి వెళి తే... అమరచింతలోని ఒకటో వార్డులో నాగుల దేవాలయం, ఉర్దూఘర్ తదితర ప్రాంతాల్లో సమీపంలో కొన్ని రోజులు గా గిరిజనతండాలకు చెందిన లంబాడీలు బహిరంగంగా నాటుసారా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా రింగ్రెడ్డి బీడీ ఫ్యాక్టరీ, పాత సంతబజారు ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇది కొనసాగుతున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన ఆయా కాలనీల యువకులు ఆదివారం ఉదయం గిరిజనులతో వాగ్వాదానికి దిగారు. కొందరు మద్యపాన ప్రియులు తాగిన మైకంలో తమ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. ఆలయం వద్ద ఎలాంటి అమ్మకాలు జరపరాదని పట్టుబట్టారు. వీరికి మహిళలు మద్దతునివ్వడమేగాక సారా విక్రయిస్తున్న లంబాడీలను పంట పొలాల వైపు తరిమివేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించాలని వారు కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు చంటి, రవి, మహిమూద్, వంశీ, హరీష్, లడ్డు, డబ్బా లక్ష్మి, బుజ్జమ్మ, సుధారణి, సునీత, రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అన్వర్ కోసం వేట
మల్దకల్, న్యూస్‌లైన్: మండలంలోని నీలిపల్లిలో సీ హెచ్(క్లోరల్ హైడ్రేట్) సూత్రదారి అన్వర్‌ను పట్టుకునేందుకు ఎక్సైజ్ అ ధికారుల వేట మొదలైంది. గద్వాల కు చెందిన అన్వర్ నీలిపల్లి సమీపంలోని వ్యవసాయ పొలం లో నిల్వచేసిన రూ.10 లక్షల విలువైన 20 క్వింటాళ్ల సీహెచ్‌ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్వర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సీహెచ్ వ్యాపారం వెనక సూత్రదారులు ఎవరనే విషయమై ఎక్సైజ్ అధికారులు తీగలాగేందుకు రం గంలోకి దిగారు. ఈ రసాయనాన్ని కలిపిన కృ త్రిమకల్లును యథేచ్ఛగా విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. మల్దక ల్ మండలం కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా గట్టు మీదుగా కేవలం 35 కి.మీ దూరం ఉంది. అటు రాయలసీమ అయి జ, శాంతినగర్, రాజోలి మీదుగా 35 కి.మీ ఉంటుంది. దీంతో సీహెచ్ వ్యాపారులు నడిగడ్డ ప్రాంతాన్ని కేంద్రబిందువుగా మార్చుకుని వ్యా పారాన్ని కొనసాగిస్తున్నారు. కర్ణాటక నుంచి సీహెచ్‌ను నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుడు దిగుమతి చేసుకుని పలు ప్రాంతాల్లో కొందరు వ్యాపారుల ద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. అన్వర్‌ను ప ట్టుకునేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కర్ణాటక, రాయలసీ మ, రాష్ట్ర రాజధానికి మూడు బృందాలు తరలివెళ్లినట్లు సమాచారం. అలాగే అతని వెనక ఎవరెవ్వరు ఉన్నారనే విషయంపై విచారణ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఓ నా యకుడి ద్వారా సీహెచ్ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలిసింది. అన్వర్ దొరికితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎక్సైజ్ అధికారులు చె బుతున్నారు. ఇదిలాఉండగా, క్లోరల్ హైడ్రేట్ విక్రయించే వ్యాపారులు కర్ణాటక నుంచి రాయలసీమలోని కర్నూలుకు, అక్కడి నుం చి గద్వాలకు సీహెచ్‌ను చేరవేస్తుంటారు. అయితే గద్వా ల నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారు ల దాడు లు జరిగినప్పుడు కర్ణాటక నుంచి రా యలసీమకు, రాయలసీమలో దాడులు జరిగినప్పుడు కర్ణాటక నుంచి గట్టు మీదుగా మల్దకల్, గద్వా ల ప్రాంతాలకు తరలిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. -
ఎక్సైజ్ కొరడా
మల్దకల్, న్యూస్‌లైన్: ఎక్సైజ్‌శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మంగళవారం సాయంత్రం మండలంలోని నీలిపల్లి గ్రామంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుమారు రూ.10 లక్షలు విలువ చేసే సీహెచ్(క్లోరల్ హైడ్రేట్)ను పట్టుకున్నారు. గద్వాల పట్టణానికి చెందిన అన్వర్ అనే రైతుకు నీలిపల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తిపంటను సాగుచేస్తున్నాడు. పొలంలో వేసిన షెడ్డులో సీహెచ్‌ను భద్రపర్చి కల్లు వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు. అయిజ, మల్దకల్, గట్టు, అలంపూర్ తదితర ప్రాంతాల్లోని కల్లు వ్యాపారులకు ఈ సీహెచ్‌ను సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. షెడ్డులో ఉంచిన 20.40 క్వింటాళ్ల సీహెచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 70 బస్తాలు ఉన్నాయి. ఒక్కోబస్తాలో 30 కేజీల సీహెచ్ ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు వివరించారు. దీనిద్వారా కృత్రిమకల్లును తయారుచేస్తారని పేర్కొన్నారు. దాడిచేసిన సమయంలో పొలం వద్ద ఉన్న రైతు అన్వర్ పరారైనట్లు తెలిపారు. అన్వర్‌పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ చెప్పారు. ఈ దాడుల్లో ఏఎస్ వివేక్, ఎక్సైజ్ సీఐలు నాగార్జునరెడ్డి, రాధాకృష్ణ, రాకేష్, మధుబాబు, ఎస్ఐ జ్ఞానయ్య, సిబ్బంది నాతానియల్, రాజేందర్, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ బాబు పాల్గొన్నారు. నాటుసారా బట్టీలపై మెరుపుదాడులు గోపాల్పేట, న్యూస్‌లైన్: మండలంలోని పలు గిరిజన తండాల్లో మంగళవారం ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్ఐ షాకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్, ఈఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి భారీగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటుసారా ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అ ముడాలకుంట తండాలో దాడి చేసి నాలుగువేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 90 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే ధర్మ్యాతండాలో 18 వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరు తం డాలో 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఒకరిపై కేసునమోదుచేశారు. ఏదులలో 630 నాటుసారా ప్యాకెట్లను స్వా ధీనం చేసుకుని ముగ్గురి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణుడు, సిబ్బంది భగవంత్‌గౌడ్, బాల య్య, సాధిక్, వసురాం, ఈఎస్పీఎఫ్ సిబ్బంది ప్రకా ష్, వీరకుమార్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, దూద్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.