‘మద్యం’కోలాహలం
ఏటీ అగ్రహారం : జిల్లాలోని 309 మద్యం దుకాణాల లెసైన్సులను ఎక్సైజ్ అధికారులు లాటరీ విధానంలో వ్యాపారులకు కేటారుుంచారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 342 దుకాణాలు ఉండగా 309 దుకాణాలకు 6,133 దరఖాస్తులు అందాయి. దుకాణాల కేటారుుంపుతో ప్రభుత్వానికి రూ.136.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. పల్నాడు ప్రాంతంలోని దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఆ ప్రాంతంలోని నడికుడి గ్రామ దుకాణానికి అత్యధికంగా 223 దరఖాస్తులు అందాయి. గుంటూరు ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని దుకాణాలకు 1434, నరసరావుపేట డివిజన్ పరిధిలో 3848, తెనాలి డివిజన్ పరిధిలోని దుకాణాలకు 852 దరఖాస్తులు దాఖలయ్యూరుు. పల్నాడు ప్రాంతంలోని అడిగొప్పల దుకాణానికి 150, కొండమోడు జంక్షన్ దుకాణానికి 143 దరఖాస్తులు వచ్చారుు. జిల్లాలోని 50 దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తే రాగా 10 దుకాణాలకు రెండేసి పడ్డాయి. తొలుత ఒక్కొక్క దరఖాస్తు వచ్చిన దుకాణాలను వ్యాపారులకు కేటారుుంచారు.
తర్వాత రెండేసి, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన దుకాణాల లెసైన్సులను లాటరీ పద్ధతిలో కేటారుుంచారు. ఉదయం ప్రారంభమైన ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. దుకాణాలు పొందిన వ్యాపారులు లెసైన్స్ ఫీజులో మూడో వంతు సొమ్మును అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో చెల్లించారు. అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.కుళ్ళాయప్ప, మెప్మా పీడీ ఢిల్లీరావు, ఆర్డీవో రామ్మూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఆదినారాయణమూర్తి, మహేష్‌కుమార్, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
అరకొర ఏర్పాట్లతో పాట్లు
ఈ కార్యక్రమం కోసం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉండటంతో వ్యాపారులు ఇక్కట్లు పడ్డారు. కుర్చీలు సరిపోక గంటల తరబడి క్యూలో నిలబడాల్సిరావటంతో అసహనం వ్యక్తం చేశారు. కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని వాపోయూరు.