శాశ్వత కార్డుల కోసం..
కలెక్టరేట్ : శాశ్వత తెలుపు రేషన్‌కార్డులు జిల్లావాసులకు అందని ద్రాక్షగా మారాయి. శాశ్వతకార్డుల కోసం గత ప్ర భుత్వం మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో లబ్ధిదారులు దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదు. నాలుగేళ్లుగా దరఖాస్తులు సమర్పించినా ప్రభుత్వం నుంచి ఒక్క శాశ్వత రేషన్‌కార్డు మంజూరు కాకపోవడం గమనార్హం. మొదటి, రెండు విడతల దరఖాస్తులకు కలిపి మూడో విడత రచ్చబండలో 52,402 కూపన్లు మంజూరు చేశారు.
కొన్ని రోజులకే బోగస్ పేర కొన్ని కూపన్లు తొలగించారు. అయితే ప్రస్తుతం 43,015 కూపన్లు ఉన్నాయి. ఆరు నెలలకు సరిపడా కూపన్లు జి ల్లాకు పంపిణీ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో కి వచ్చిన ఏడాదికే కొత్త రేషన్‌కార్డులకు శ్రీకారం చుట్టా రు. అర్హులు గల లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు అందజేశారు. ప్రస్తుతం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. శాశ్వత రేషన్‌కార్డులు అందజేయాలని కోరుతున్నారు.
జిల్లాలో 1.50 లక్షలకుపైగా దరఖాస్తులు
జిల్లాలో 7,05,429 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 43,015 తాత్కాలిక కార్డులు ఉన్నాయి. జిల్లాలోని 1,716 చౌకధరల దుకాణాల ద్వారా తొమ్మిది రకాల ని త్యావసర సరుకులు అందుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నెలకు 10,579.635 మెట్రిక్ టన్నుల బియ్యంతోపాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు సరఫరా అవుతున్నాయి. జూన్ మాసానికి సంబంధించి న సరుకులు కూపన్‌దారులకు అందజేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారులు డీలర్లకు సూచించారు.
జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో రేషన్‌కార్డుల కోసం సుమారు 1,50,887 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం మొదటి విడతలో 46,652 లబ్ధిదారులను, రెండో విడతలో 40,440 లబ్ధిదారులను మొత్తం 87,092 మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ప్రభుత్వం మూడో విడత రచ్చబండలో 52,402 తాత్కాలిక కూపన్లు ప్రజా పంపిణీ కింద సరుకులు పొందేందుకు మంజూరు చేసింది. ఇందులోంచి బోగస్‌గా 9,387 కార్డులను బోగస్ పేర తొలగించారు.
కొత్త ప్రభుత్వంపై ఆశలు
రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బం దులకు గురవుతున్నారు. రచ్చబండ పేరిట కూపన్లు జా రీ చేసిన లబ్ధిదారులు ఎక్కువ.. కూపన్లు తక్కువగా ఉం డడంతో అర్హులకు అందలేదు. ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడటం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం రేషన్‌కార్డులు జారీ చేపట్టినట్లయితే అర్హులకు ఇబ్బందు లు తప్పుతాయి. శాశ్వత రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి పొందే సంక్షేమ పథకాలకు అందకుం డా పోతున్నాయి. ఈ విషయమై తాత్కాలిక కూపన్లను శాశ్వతకార్డులుగా గుర్తించవచ్చని, కొత్త రాష్ట్రం, కొత్త ప్ర భుత్వంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టే అవకాశాలు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.