అమరచింత, న్యూస్‌లైన్ : నిత్యం జనంతో కిటకిటలాడే ఆలయం ప్రాంగణం వద్ద సారా విక్రయాలు అరికట్టాలని ఆ కాలనీ యువత నడుం బిగించింది.. అందుకు మహిళల మద్దతూ లభించింది.. చివరకు అమ్మకాలు వద్దంటూ గిరిజనులతో వాగ్వాదానికి దిగి తరిమేశారు.. వివరాల్లోకి వెళి తే... అమరచింతలోని ఒకటో వార్డులో నాగుల దేవాలయం, ఉర్దూఘర్ తదితర ప్రాంతాల్లో సమీపంలో కొన్ని రోజులు గా గిరిజనతండాలకు చెందిన లంబాడీలు బహిరంగంగా నాటుసారా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా రింగ్‌రెడ్డి బీడీ ఫ్యాక్టరీ, పాత సంతబజారు ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇది కొనసాగుతున్నాయి.
దీంతో ఆగ్రహం చెందిన ఆయా కాలనీల యువకులు ఆదివారం ఉదయం గిరిజనులతో వాగ్వాదానికి దిగారు. కొందరు మద్యపాన ప్రియులు తాగిన మైకంలో తమ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. ఆలయం వద్ద ఎలాంటి అమ్మకాలు జరపరాదని పట్టుబట్టారు. వీరికి మహిళలు మద్దతునివ్వడమేగాక సారా విక్రయిస్తున్న లంబాడీలను పంట పొలాల వైపు తరిమివేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించాలని వారు కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు చంటి, రవి, మహిమూద్, వంశీ, హరీష్, లడ్డు, డబ్బా లక్ష్మి, బుజ్జమ్మ, సుధారణి, సునీత, రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
సారాపై యువకుల సమరం
Published Mon, Jan 13 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement