
నిందితుడు శ్రీనివాసరావుతో సీఐ యు. శోభన్‌బాబు, సిబ్బంది
యడ్లపాడు: ప్రియురాలిని హత్య చేసిన కేసులో నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు. శోభన్‌బాబు వివరాలు వెల్లడించారు. గుంటూరు సంగడిగుంటకు చెందిన పిల్లి పార్వతి(45)తో అదే ప్రాంతానికి చెందిన రాడ్ బెండింగ్ పనులు చేసుకునే యర్రా శ్రీనివాసరావుకి వివాహేతర సంబంధం ఏర్పడింది. పార్వతికి రూ.25 వేలను కూడా శ్రీనివాసరావు అప్పుగా ఇచ్చాడు. పార్వతి నడవడికపై అనుమానం వచ్చిన అతడు నిలదీయడంతో ఇద్దరి మధ్యా గొడవులు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన డబ్బు వేలు ఇవ్వాలంటూ అడగడంతో వివాదం మరింత ఘర్షణకు దారితీసింది. దీంతో మార్చి 30 యడ్లపాడు మండలం బోయపాలెం డైట్ కళాశాల వెనుక పొలాల్లోకి పార్వతిని తీసుకువెళ్లి చీరతో ఉరివేసి హత్య చేశాడు. శుక్రవారం చిలకలూరిపేటలోని ఏఎంజీ వద్ద నిందితుడిని పట్టుకుని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment